లేఖ రాయడం కాదు.. దమ్ముంటే చర్చకు రండి

టీడీపీ ఎమ్మెల్యేలకు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు సవాల్‌

అధికారంలో ఉండ‌గా చంద్ర‌బాబు ప్ర‌కాశం జిల్లాకు ఏం చేశారు..?

సీఎం పర్యటన అనంతరం చర్చ ఎక్కడపెట్టినా వస్తాం

ఒంగోలు: చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టుపై సంతకాలు పెట్టి మీడియాకిచ్చే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే ప్రకాశం జిల్లా అభివృద్ధిపై చర్చకు రావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు బహిరంగ సవాల్‌ విసిరారు. ప్రకాశం జిల్లా మీద, జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే ఐదేళ్లలో మా జిల్లాకు ఏం చేశావని చంద్రబాబుకు లేఖ రాయాలన్నారు. 2014–19 ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రకాశం జిల్లాకు ఏం చేశాడు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి  2021 అక్టోబర్‌ 6వ తేదీ నేటి వరకు సీఎం వైయస్‌ జగన్‌ ఏం చేశారనే అంశంపై ఒంగోలు కలెక్టరేట్‌ ఎదురుగా బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరాను. ఒంగోలులో  ఎమ్మెల్యే సుధాకర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు లేఖలు రాసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు.  
– 2019 జనవరి 11వ తేదీన రామాయపట్నం పోర్టు శంకుస్థాపన సభలో రూ.4500 కోట్లను వెచ్చించి పోర్టును అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెప్పిన మాట నిజమా.. కాదా..? 
– అదే సభలో రూ.2024 కోట్లతో పేపర్‌ మిల్లు తీసుకువచ్చాను.. ఇండోనేషియా కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు వచ్చిందన్న చంద్రబాబు.. ఆ పేపర్‌ మిల్లు ప్రకాశం జిల్లాలో ఎక్కడ పెట్టారు.. ఎక్కడ శంకుస్థాపన జరిగింది..? 
– ప్రకాశం జిల్లాలో మైనింగ్‌ యూనివర్సిటీని స్థాపిస్తానన్నారు.. ఐదేళ్లలో ఎందుకు మైనింగ్‌ యూనివర్సిటీని ప్రారంభించలేకపోయారు..?
– టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీ నామకరణం చేసి.. ఒక్క ఉద్యోగి నియామకాన్ని చేపట్టకుండా కేవలం పేరు ప్రకటించిన మాట వాస్తవమా కాదా..?
– రైతుల గిట్టుబాటు ధర కోసం జీఓ 31 విడుదల చేసి సుబాబుల్, జామాయిల్‌కు రూ.4200 ధరను కచ్చితంగా కంపెనీలు చెల్లించాలని ఎందుకు అమలు చేయలేకపోయారు..?
– దొనకొండ ప్రాంతంలోని సెజ్‌లో విమానాల స్పెర్స్‌ పార్ట్‌ల తయారీ పరిశ్రమను స్థాపిస్తామన్నారు.. అదెక్కడుంది..?
– వెటర్నరీ యూనివర్సిటీ ప్రకాశం జిల్లాలో ఎక్కడ స్థాపించారు..? ఎంత పెట్టుబడి పెట్టారు..?
– వెలుగొండ కోసం చంద్రబాబు తన 14 ఏళ్ల హయాంలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు..?  
– గుళ్లకమ్మ నిర్మాణానికి సంబంధించి ప్రకాశం జిల్లాలో అత్యధిక మంది సన్న, చిన్నకారు, పెద్ద రైతులు సంతోషంగా ఉండటానికి, మద్దిపాడు, నాగులపాడు, కొత్తపట్నం మండలం సస్యశ్యామలం అవ్వడానికి దివంగత మహానేత వైయస్‌ఆర్‌ కారణమా కాదా..? దాంట్లో చంద్రబాబు పాత్ర ఎంత..? 
– రామతీర్థం నిర్మాణంలో చంద్రబాబు పాత్ర ఎంత..? వైయస్‌ఆర్‌ పాత్ర ఎంత..? 
వీటిపై చర్చకు వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉందని, సీఎం పర్యటన అనంతరం చర్చ ఎక్కడ పెట్టినా తాము వచ్చి మీడియా ముఖంగా ఆధారాలతో చర్చిస్తామన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top