వైయ‌స్ఆర్  బీమా...పేదలకు ధీమా 

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను

ఎన్టీఆర్ జిల్లా: పేదలకు సంక్షేమాన్ని అందించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు అని వైయ‌స్ఆర్‌ బీమా అమలులో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను  పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం, నందిగామ మండలం, కొణతమాత్మకూరు గ్రామానికి చెందిన కొండిశెట్టి నాగేశ్వరరావు  ఇటీవల కాలంలో మరణించాడు. ఈ సందర్భంగా ప్రభుత్వం ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను  అందజేశారు.

ఎమ్మెల్యే ఉదయభాను మాట్లాడుతూ..  దురదృష్టవశాత్తు కొండిశెట్టి నాగేశ్వరరావు మరణించడం బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. ఎవరైనా వ్యక్తి ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా మరణిస్తే బాధిత కుటుంబాలకు భారం కాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్ బీమా పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ ఎల్లప్పుడూ పేదల సంక్షేమం గురించి  ఆలోచించే గొప్ప మనసున్న నాయ‌కుల‌ని ఉద‌య‌భాను కొనియాడారు.  

Back to Top