కర్నూలు: పేదలను ఉన్నతస్థాయిలో నిలబెట్టాలనే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోందని ఆదోని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు విద్యా కానుక కిట్లు అందించేందుకు సీఎం వైయస్ జగన్ ఆదోనికి రావడం సంతోషంగా ఉందని, నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ వేదికపై విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. ‘జగనన్న పాదయాత్ర చేసినప్పుడు ఏ విధంగా పేదల కష్టాలు తెలుసుకున్నారో.. ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కష్టాలన్నీ పేదల నుంచి దూరం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లారు. గతంలో మండల వ్యవస్థ తీసుకువస్తే.. సీఎం వైయస్ జగన్ గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి.. పాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 1.35 లక్షల మందికి సచివాలయ వ్యవస్థతో శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. డాక్టర్‌గా ప్రజల నాడిపట్టుకొని ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ అన్ని కార్యక్రమాలు ప్రజలు మెచ్చే విధంగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలన సాగింది. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు ప్రజలకు సహకారం అందించే కార్యక్రమాలు ఏమీ చేయలేదు. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడపలేదు. సీఎం వైయస్ జగన్.. అమ్మ ఒడి పథకం ద్వారా పేదలకు చదువులు దగ్గర చేశారు. నాడు–నేడుతో స్కూళ్లను ఆధునీకరించారు. ఇలాంటి ముఖ్యమంత్రి 30 ఏళ్ల పరిపాలన కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. పేదవాడిని ఉన్నత స్థాయిని నిలబెట్టేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఆదోని నియోజకవర్గానికి.. ఆదోని అభివృద్ధి కోసం ఆదోని డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని సీఎంను కోరుతున్నాను. ఆదోనిలో ఆటోనగర్ కావాలి. ఆటోనగర్ వస్తే పది వేల మందికి ఉపాధి కల్పించవచ్చు. ఆదోని విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కావాలి. జగనన్న కాలనీకి రోడ్లు, కొన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా, బుడగ జంగాల వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రిని కోరుతున్నా’ను అని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు.