ఏపీకి మంచిరోజులొచ్చాయి..

 దేశానికే ఆదర్శంగా  వైయస్‌ జగన్‌ అసెంబ్లీని నడిపిస్తారు..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

అమరావతి:గత టీడీపీ ప్రభుత్వం సభా సంప్రదాయాలను తుంగలో తొక్కడంతో రెండు సంవత్సరాలు వైయస్‌ఆర్‌సీపీ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలకు రాలేని పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా, మేం ఎమ్మెల్యేగా ఇదే అసెంబ్లీలో అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఏపీకి మంచి రోజలు వచ్చాయని,పారదర్శకమైన పాలన  సీఎం వైయస్‌ జగన్‌ చేయబోతున్నారని తెలిపారు.దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుందన్నారు.దేశానికి ఆదర్శవంతంగా అసెంబ్లీని వైయస్‌ జగన్‌మోహన్‌రెడి నడిస్తారని తెలిపారు.గత టీడీపీ ప్రభుత్వంలా కాకుండా..గొంతు నొక్కే ప్రయత్నం చేయకుండా.. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల సమస్యలపై గళం వినిపించేవిధంగా మంచి సంప్రదాయాన్ని అసెంబ్లీలో తీసుకురాబోతున్నారని తెలిపారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top