కార్మికుల చిరకాల కల ఆర్టీసీ విలీనం

రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురం

 

2015లో తిరుపతిలో మా యూనియన్ మీటింగ్‌లో ఆర్టీసీపైన, ఆర్టీసీకున్న నష్టాలు, దాన్ని గట్టెక్కించే మార్గాలు, కార్మికులకు భరోసా కల్పించడం ప్రజలకు మంచి రవాణా వ్యవస్థ ఉండాలనే ఉద్దేశ్యంతో జగన్ గారు కార్మికులందరికీ మాటిచ్చారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని అప్పుడున్న తెలుగుదేశాన్ని డిమాండ్ చేద్దామన్నారు. వాళ్లు చేయకపోతే మన ప్రభుత్వం రాగానే చేద్దామన్నారు. మాటపై నిలబడే వ్యక్తి కనుక జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు హితకరమైన బిల్లు ఇది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు ఉపయోగపడేలా చేయడానికే ఈ బిల్లు ప్రవేశ పెట్టారు.
ఆర్టీసీకి చాలా నష్టాలు, కష్టాలున్నాయి. టీడీపీ హయాంలో కార్మికులకు సంబంధించి వారి పీఎఫ్ డబ్బును కూడా వాడేసే స్థాయికి ఆర్టీసీ దిగజారిపోయింది. వారి కొఆపరేటివ్ సొసైటీలోని డబ్బులు, ఉద్యోగస్తుల అరియర్స్ డబ్బును కూడా వాడేసిన పరిస్థితి. ఇవన్నీ కలిపితే ఆర్టీసీ 6934కోట్ల నష్టాలకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులకు ఉద్యోగ భద్రతపై సందేహాలు నెలకొన్నాయి. ఆర్టీసీ ఉంటుందో లేదో అనే స్థితి, బ్యాంకుల్లో ఎంపీ అయిపోయే పరిస్థితి, కొద్ది రోజులకు బ్యాంకులు ఆక్షన్ కు వచ్చే స్థితి దాపురించింది. ఇలాంటి పరిస్థితిలో సీఎం జగన్ గారు కార్మికులకు ఓ భరోసా కల్పించేందుకు ఈ బిల్లు ప్రవేశ పెట్టారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఆర్టీసీ ప్రైవేటేజషన్ దిశలో చాలా రాష్ట్రాలు నడుస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఓ చరిత్ర. కార్మికుల దృష్టిలో, ప్రజల దృష్టిలో ఓ కల. గట్స్ ఉన్న నాయకులు మాత్రమే తీసుకోగల నిర్ణయమిది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మన ముఖ్యమంత్రిని ఖచ్చితంగా శ్లాఘించాలి.
చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆర్టీసీకి మేలు చేసిందెప్పుడూ లేదు. ఆర్టీసీని నిర్వీర్యం మాత్రం చేసాడు. ప్రైవేటేజేషన్ అంటే బాబుకు ముద్దు. 1994లోనే ప్రైవేటేజేషన్ ఎంత బాగా చేయొచ్చో ఆయనే స్వయంగా పుస్తకమే ప్రచురించారు. ఆ పుస్తకంలో తొలి పేజీలోనే దాదాపు 18 యూనిట్లను ప్రైవేటు పరం చేసినట్టు రాసుకున్నారు.
ప్రభుత్వ సంస్థలను ఎలా మూతబెట్టాలో టార్గెట్ పెట్టుకుని మరీ చేసారు. ఆ టార్గెట్ ఎలా రీచ్ అయ్యారో ఈ పుస్తకంలో వివరంగా రాసారు. హనుమాన్ కోఆపరేటివ్ షుగర్ మిల్లు, ఎఎస్సెమ్ కోఆపరేటివ్ షుగర్ మిల్స్, ఆదిలాబాద్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్, రాజమండ్రి కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్, నిజాం షుగర్స్ లిమిటెడ్, చాగల్లు డిస్లినరీ, షక్కర్ నగర్ షుగర్ మిల్స్, షక్కర్ నగర్ డిస్లరీ, మూంబుజ్ పల్లీ షుగర్ మిల్, మెట్ పల్లి షుగర్ మిల్, మధురా నగర్ షుగర్ మిల్, మాంబోజీపల్లి డిస్లరీ, నంద్యాల కోఆపరేటివ్ షుగర్ మిల్, నాగార్జునా కోఆపరేటివ్ షుగర్ మిల్, పర్చూర్ స్పిన్నింగ్ మిల్..టార్గెట్ పెట్టుకున్న విధంగా ఫస్ట్ ఫేజ్‌ లోనే 18 యూనిట్లను ప్రైవేటు పరం చేసేసారు. నామినల్ రేట్లకు తమ బినామీలకు అమ్మేసారు.  
ఇక మూసేసినవైతే లెక్కేలేదు.
ఏపీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవల్మెంట్ కార్పొరేషన్, ఆల్విన్ వాచెస్ లిమిటెడ్, నెల్లూరు కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, చీరాల కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, చిలకలూరిపేట కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్ ఇవన్నీ బాబుగారి పాలనలో మూతబడ్డాయి.
ఇవే కాదు - ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హ్యాండీ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీటన్నిటినీ ఫేజ్ 1లో రీస్ట్రక్చర్ పేరుతో మూసేసారు.
ఇలాగే ఫేజ్ 2లో దాదాపుగా 68 టార్గెట్ పెట్టారు. వాటిలొ 15 వరకూ 2002-2003 కల్లా కంప్లీట్ చేయాలని అనుకున్నారు.
ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు ప్రముఖ పాత్ర వహిస్తారు తప్ప నిర్మించేది, అభివృద్ధి చేసేది చంద్రబాబు మనస్తత్వం కాదు. రైతు అనేవాడు పంట ఎలా పండించాలని ఆలోచన చేస్తాడు. దొంగలు ఎలా దోచుకోవాలా అనే ఆలోచిస్తారు. ఇలా బాబు పరిపాలన అంతా సాగింది.
ఆర్టీసీని నిర్వీర్యం చేయడం కోసం, ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేయడం కోసం తన బినామీలకు, అనుచరులకు కట్టబెట్టారు. డిపోల్లో కమర్షలైజ్ చేయాలని విజయవాడ, రాజమండ్రి, విశాఖ, కాకినాడ, ఏలూరుల్లో బినామీలకు కాంట్రాక్టులు పంచిపెట్టారు. అక్రమంగా ప్రైవేటు రవాణా వ్యవస్థను పెంచి పోషించారు. దివాకర్‌ రెడ్డి ట్రావెల్స్ వందలాది బస్సులు నడుపుతోంది. కేశినేని నానీకి కూడా 500కు పైగా బస్సులున్నాయి. కాళేశ్వరి, మోడ్రన్ బస్సులు పేరుతో టీడీపీ బినామీల వేలాది ప్రైవేటు బస్సులను ప్రోత్సహించడానికి ఆర్టీసీని సర్వనాశనం చేసారు. ఆర్టీసీని రిలయన్స్ కు అమ్ముకోవాలనే ఉద్దేశ్యంతో పావులు కూడా కదిపాడు చంద్రబాబు. కానీ అదృష్టవశాత్తూ 2004లో రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అవ్వడంతో ఆ ప్రయత్నం సాగలేదు. అప్పుడే కనుక వైయస్సార్ సీఎం కాకపోయి ఉంటే ఆర్టీసీ అనేది రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కాకుండా రిలయన్స్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అయ్యుండేది.
వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఆర్టీసీని ఎలా కాపాడారో అందరికీ తెలుసు. అప్పటికున్న అరియర్స్ 1200 కోట్ల రూపాయిలు రీయంబర్స్ చేసారు. అంతేకాదు 12000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసారు వైయస్సార్. బస్ పాసులపైన రీయంబర్స్మెంట్ 500 కోట్లు ఇచ్చే ఆనవాయితీని రాజశేఖర్ రెడ్డిగారు ఆరోజున ప్రవేశపెట్టారు. దాంతో తర్వాతి ప్రభుత్వాలు, చివరకు చంద్రబాబు కూడా ఆ సొమ్ము ఇవ్వాల్సి వచ్చింది. ఇలా ఎన్నో అండదండలు అందించడం వల్లే ఆర్టీసీ బ్రతికి బట్టకట్టగలిగింది. ఆ వైయస్సార్ తనయుడైన వైయస్ జగన్ మరో నాలుగడుగులు ముందుకేసి ఈ ఆర్టీసీ వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు ఓనర్లకు లాభం వస్తుంది తప్ప ఆర్టీసీకి లాభం రాదు. అది మేనేజ్‌మెంట్ లోపమా లేక ప్రభుత్వం సపోర్టు చేయకపోవడం వల్లో నష్టమే ఎప్పుడూ వస్తుంటుంది. ఇప్పుడే ట్రాన్స్‌ పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని చెప్పారు - రెండునెలల వ్యవధిలోనే 250 కోట్ల నష్టాలను తగ్గించామన్నారు. ఆర్టీసీ వ్యవస్థను బాగుపరచాలని, ఆర్టీసీకి మంచిరోజులు రాబోతున్నాయి. కార్మికులకు మంచి జరగబోతోంది. గతంలో ఆర్టీసీ ఒక బస్సుకు 8 మంది పనిచేసేవారు. ఇప్పుడు దాన్ని 5 మందికి కుదించారు. సాంక్షన్‌ పోస్టుల కంటే తక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది. దాన్ని ఫిలప్ చేయాలని కోరుతున్నాం. ఆర్టీసీ అంటేనే డ్రైవరు, కండెక్టరు, క్లీనరు గుర్తొస్తారు. కండెక్టర్ల వ్యవస్థను దాదాపుగా రద్దు చేసేసారు. కండక్టర్లను నియమించాలి. లేదంటే డ్రైవర్లకు పని భారం పెరిగిపోయి ఒక్కోసారి స్టీరింగ్ పైనే తల వాల్చి మరణించిన సందర్భాలు ఎదురయ్యాయి. ఆ ఒత్తిడి వల్లే మెడికల్లీ అన్‌ఫిట్ అయిన కేసులు కూడా ఎన్నో ఉన్నాయి. డ్రైవరే కండక్టర్ డ్యూటీ చేస్తున్నప్పుడు రెండు డ్యూటీల ఒత్తిడిలో ఒకటో అరో టికెట్లు మిస్ అయితే, పనిష్మెంట్ గా ఉద్యోగంలోంచి తీసేసే పరిస్థితి ఉంటోంది. ఉద్యోగం ఉంచినా 5, 6 స్థాయిల్లో ఆ ఉద్యోగం నిలబడే ప్రక్రియ పూర్తయ్యేదాకా కనీసం ఆరునెలలు ఖాళీగా ఇంటివద్ద కూర్చోవాల్సి వస్తోంది. 2004కు ముందు రిక్రూట్ అయిన వారికి పాత పింఛన్ స్కీమ్ వర్తిస్తోంది. 2004తర్వాత వచ్చిన వారికి సీపీఎస్ విధానం అమలౌతోంది. అందరికీ పాత పింఛను విధానమే అమలు చేయాలని, మహిళా కార్మికుల సమస్యలను కూడా సహృదయంతో అర్థం చేసుకుని పరిష్కరిస్తే సంతోషిస్తారు. పారిశుధ్య కార్మికులు కాంట్రాక్టు బేసిస్ లో పని చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికుల జీతాలు రూ.18000 చేసారు. అదేవిధంగా వీరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. ఛార్జీల పెంపుపై ఒక రెగ్యులేటరీ కమీషన్ ఉంటే డీజిల్ రేట్లను బట్టి మార్పులు చేసేందుకు అనువుగా ఉంటుంది. ఆలిండియా టూరిస్ట్ పర్మిట్లని, కాంట్రక్ట్ కార్యదర్శి పేరుతో అక్రమ రవాణా జరుగుతోంది. దీనికోసం ఐఎఎస్ ఆధ్వర్యంలో ఒక వ్యవస్థను ఏర్పాటుచేసి అక్రమ రవాణాను అరికట్టాలి. ఆర్టీసీలో ఖర్చులు, దుబారా తగ్గిస్తే త్వరలో ఆర్టీసీ లాభాల బాట పడుతుంది. ఆర్టీసీ అంటే ప్రజలు అమ్మో అనే పరిస్థితి నుంచి అబ్బో అనే లెవెల్ కు తీసుకెళ్లాలి. ఆర్టీసీ విలీనం కార్మికుల కల. దాన్ని నెరవేరుస్తున్నారు సీఎం జగన్. ఎంతో బృహత్తరమైన, ప్రజాహితమైన కార్యక్రమాన్ని, కార్మిక సంక్షేమ కార్యక్రమాన్ని బిల్లుగా తెచ్చి, జనవరి 1కల్లా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినందుకు ముఖ్యమంత్రిగారికి పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నాం. కార్మికులకు ఇవాళ పెద్ద పండుగలాగే ఉంది.  

 

Back to Top