వైయస్‌ఆర్ జిల్లా: సుదీర్ఘమైన పాదయాత్రతో వైయస్ జగన్ చరిత్ర సృష్టించారని వైయస్‌ఆర్‌సీపీ నేత రవీంద్రనా«ద్ రెడ్డి తెలిపారు.పాదయాత్ర ముగించుకుని వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో అపూర్వ స్వాగతం లభించిందన్నారు. రాజన్న బిడ్డను ఆశీర్వదించాలని గ్రామాల్లో ప్రజలు సైతం తరలివచ్చారన్నారు.నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం తప్ప అభివృద్ధి లేదన్నారు. అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని రాష్ట్ర సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రతో దాదాపు కోట్లాది మంది ప్రజలను కలిసిన నాయకుడు వైయస్ జగన్ తప్ప ఎవరూ లేరన్నారు.రాష్ట్ర ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయన్నారు.