శ్రీవారి ఆశీస్సులు సీఎంకు ఎప్పుడూ ఉండాలి

తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి

తిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆశీస్సులు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎప్పుడూ ఉండాలని కోరుకున్నానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌పై శ్రీవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top