ఆధారాలు చూపించకపోతే బాబు పక్కన నేను కూడా దీక్ష చేస్తా

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి

తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపకపోతే బాబుపై పరువునష్టం దావా

టీడీపీ విడుదల చేసిన ఛార్జ్‌షిట్‌ ఆబద్ధాల పుట్ట

ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకు చంద్రబాబు దీక్ష 

విజయవాడ: ఇసుక అక్రమ రవాణాపై చంద్రబాబు ఆధారాలు చూపించాలి. తనపై చేసిన ఆరోపణలకు సాయంత్రంలోగా ఆధారాలు చూపించాలని లేదంటే రేపు బాబు దీక్ష పక్కన నేను కూడా దీక్ష చేస్తానని ఎమ్మెల్యే పార్థసారధి హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని, లేకపోతే చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన పేర్కొన్నారు. టీడీపీ విడుదల చేసిన ఛార్జ్‌షిట్‌ ఆబద్ధాల పుట్ట అని కొట్టిపారేశారు. బీసీ నేతలను టార్గెట్‌ చేసుకొని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక అవినీతిలో కూరుకుపోయింది చంద్రబాబు, లోకేష్‌లే అని వెల్లడించారు. తన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకు చంద్రబాబు దీక్ష చేస్తున్నారని విమర్శించారు. ఇసుకను అన్నంలా తిన్న చరిత్ర చంద్రబాబుదని అభివర్ణించారు.గత చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్‌జీటీ రూ.100 కోట్లు జరిమానా విధించిందని గుర్తు చేశారు.అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దార్‌ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేశారని తెలిపారు.

Read Also: కేబినెట్‌ మీటింగ్‌ ప్రారంభం

Back to Top