వ‌ర్షాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి
 

నెల్లూరు: విస్తారంగా కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులు నుంచి నియోజకవర్గంలో విస్తారం గా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు ఉన్న గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని, విస్తారంగా కురుస్తున్న వర్షాలలో జాగ్రత్త గా ఉండాలని ఈ సందర్భంగా శాసనసభ్యులు మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి  కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top