బాబుకు ఎన్నికల భయం పట్టుకుంది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సవాల్‌

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎన్నికలు జరపాలని చూస్తుంటే.. స్టేల కోసం టీడీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలని కుట్ర చేస్తున్నాడన్నారు. విజయవాడలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ..  ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబుకు బీసీలు గుర్తొచ్చారని, అధికారంలో ఉండగా బీసీలకు టీడీపీ చేసిందేమీ లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ కనుచూపు మేరలో కూడా కనిపించదన్నారు. అధికారం కోల్పోయారని తండ్రీకొడుకు కడుపుమంటతో విమర్శిస్తున్నారన్నారు. 90 శాతం ఎన్నికల హామీని సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేశారని, సంక్షేమ పథకాలు డోర్‌ డెలివరీ చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా..? అని సవాల్‌ విసిరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top