ప‌వ‌న్‌కు స‌భ్య‌త‌, సంస్కారం ఉన్నాయా..?

వ‌లంటీర్ల‌కు, ప్ర‌భుత్వానికి మంచిపేరు వ‌స్తుంద‌నే ప‌వ‌న్ క‌డుపుమంట‌

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు

కాకినాడ: పవన్‌ కల్యాణ్‌కు సభ్యత, సంస్కారం ఉన్నాయా..? అని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ప్ర‌శ్నించారు. సీఎం వైయస్‌ జగన్‌పై ద్వేషంతో, ప్రభుత్వానికి, వలంటీర్లకు మంచి పేరు వ‌స్తుంద‌నే క‌డుపుమంట‌తోనే దుర్మార్గ‌పు మాట‌లు మాట్లాడుతున్నాడ‌ని ఫైర‌య్యారు. క‌నీస స్పృహ లేకుండా మాట్లాడటం పవన్‌కు అలవాటైందన్నారు. వ‌లంటీర్ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కుర‌సాల క‌న్న‌బాబు తీవ్రంగా ఖండించారు. నిస్వార్థంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్న వ్య‌వ‌స్థ‌పై త‌ప్పుడు మాట‌లు మాట్లాడిన ప‌వ‌న్‌పై మండిప‌డ్డారు. అవగాహనలేమితోనే వలంటీర్లపై పవన్‌ మాట్లాడుతున్నాడని, ప్రజల్లో ఏం జరుగుతుందో పవన్‌కు తెలియడం లేదన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌పై కక్ష, ద్వేషం, అసూయతోనే పవన్‌ మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. 

కాకినాడలో వలంటీర్లతో మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌జల్లో వలంటీర్లకు, ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో పవన్‌కు కడుపు మండిపోతుంద‌ని, అంద‌కే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడ‌న్నారు. వలంటీర్ల వ్యవస్థ‌ను సీఎం వైయ‌స్‌ జగన్ తీసుకువచ్చారని, ఆ వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుగా చిత్రీక‌రించాల‌ని ప‌వ‌న్ కుట్ర చేస్తున్నాడ‌న్నారు. 2021 నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం మహిళల అదృశ్యంలో ఏపీ 11వ స్థానంలో ఉంద‌ని, రికవరీలో 2వ స్థానంలో ఉంద‌న్నారు. మరీ ఏపీ కంటే ముందున్న 10  రాష్ట్రాల్లో వలంటీర్ వ్యవస్థ‌ లేదు కదా..?, ఆ రాష్ట్రాల్లో మహిళల అదృశ్యానికి కారణం ఎవరూ..? అని ప్ర‌శ్నించారు. స్పృహ లేకుండా మాట్లాడడం.. బురద చల్లేయడం పవన్‌కు అలవాటైంద‌ని మండిప‌డ్డారు. 

Back to Top