తండ్రిని మించిన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌

నేను విన్నాను.. నేను ఉన్నానని మాటిచ్చాడు.. అండగా నిలిచాడు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం: ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూసి నేను విన్నాను.. నేను ఉన్నానని ధైర్యం చెబితే తండ్రికి తగ్గ తనయుడు వచ్చాడని ప్రజలంతా విశ్వసించారు.. అధికారంలో వచ్చిన తరువాత తొమ్మిది నెలల పాలనలోనే తండ్రికి మించిన తనయుడిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పేరుతెచ్చుకున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా విజయనగరంలోని అయోధ్య మైదానంలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే వీరభద్రస్వామి మాట్లాడుతూ.. విద్యల నగరంగా పేరుగాంచిన విజయనగరంలో జగనన్న వసతి దీవెన ప్రారంభించడం జిల్లా ప్రజలందరికీ ఆనందంగా ఉంది. పొట్టకూటి కోసం వలసలు వెళ్లే అన్నదాతలు నేడు వైయస్‌ఆర్‌ రైతు భరోసా వల్ల వ్యవసాయం చేసుకుంటున్నారు. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, నాడు–నేడు, కంటి వెలుగు, మధ్యాహ్నం భోజనం తీసుకువచ్చి ఒక ధైర్యం కల్పించారు. ఏదైనా ఒక వ్యాధి వస్తే కంటి ముందే ప్రాణాలు కోల్పోకుండా.. ఆరోగ్యశ్రీ తీసుకువచ్చి 2 వేల జబ్బులను అందులో చేర్చారు. ఏ రాష్ట్రంలోనైనా ఆస్పత్రులకు వెళ్లి కార్పరేట్‌ వైద్యం చేయించుకోండి అని చెప్పారు. విద్యా, వైద్యానికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారు. వీటితో రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇంగ్లిష్‌ మీడియం వల్ల పేద పిల్లలు కూడా మంచి చదువులు చదువుకుంటారు. 

ఫిబ్రవరి 1 వచ్చింది.. పెన్షన్‌కు వెళ్లి క్యూలైన్‌లో నిలబడాలని అనుకుంటున్న తరుణంలో వలంటీర్లు తలుపు తట్టి పెన్షన్‌ ఇస్తుంటే.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆనందానికి అవదులు లేవు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేశారు. కుళ్లు బుద్ధితో, కడుపుమంటతో చంద్రబాబు బాధపడుతున్నాడు. పరిపాలన వికేంద్రీకరణను కర్ణాటక ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది. దిశ చట్టాన్ని మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు అమలు చేయాలనే ఆలోచన చేస్తున్నాయి. వలంటీర్‌ వ్యవస్థను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అమలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు వైయస్‌ జగన్‌ మార్గదర్శకులు అవుతారు. దశ, దిశ నిర్దేశకులు అవుతారు. 
 

తాజా వీడియోలు

Back to Top