సీఎం ప్రతిపాదనతో ప్రజల్లో ఆనందం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి

విశాఖపట్నం: విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ముఖ్యమంత్రి ప్రతిపాదించడం యావత్‌ ఉత్తరాంధ్ర కాకుండా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు విశాఖను క్యాపిటల్‌గా ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ ఎదురైందన్నారు. జీఎన్‌రావు కమిటీ రిపోర్టు మేరకు పరిపాలనను వికేంద్రీకరణ చేయాలని విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రతిపాదించడం సంతోషంగా ఉందన్నారు. విశాఖ ఈ దేశంలో అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందే నగరమని, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వస్తే ఈ నగరానికి ఆనుకొని ఉన్న జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. క్యాపిటల్‌ కోసం వెనుకబడి ప్రాంత ప్రజలమంతా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నామని, దానికి సాక్షంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రతిపాదించిన తరువాత మొదటి సారి విశాఖకు వస్తున్నందుకు థ్యాంక్స్‌ చెప్పాలని పార్టీలకు అతీతంగా ప్రజలంతా తరలివచ్చారన్నారు.  

Back to Top