చంద్రబాబులా అబద్ధాలను ప్రచారం చేసే తీరు మాది కాదు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కిలారి రోశయ్య 

కాగ్‌ క్లారిఫికేషన్‌ను భూతద్దంలో చూపించి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం

రాష్ట్ర ప్రభుత్వంపై ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు.

తాడేపల్లి:  ప్రతిపక్ష నేత చంద్రబాబులా అబద్ధాలు ప్రచారం చేసే తీరు మా ప్రభుత్వానికి కాదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ఎల్లోమీడియా, ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాగ్‌ అధికారులు అడిగిన క్లారిఫికేషన్‌ను భూతద్దంలో చూపించి విష ప్రచారం చేయడం సరికాదన్నారు.  పీఏసీ చైర్మన్‌ పయ్యవుల కేశవ్‌ ఆరోపణలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వివరణ ఇస్తే..చులకగా మాట్లాడారని ప్రతిపక్ష నేతలు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కిలారి రోశయ్య మీడియాతో మాట్లాడారు.

టీడీపీ హయాంలో రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఇలాంటి కథనాలు ఎల్లోమీడియా రాయడం లేదు. మా ప్రభుత్వంలో కాగ్‌ అధికారుల క్లారిఫికేషన్‌ను భూతద్దంలో చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రూ.41 వేల కోట్ల పద్దుల్లో మార్పులు గమనించాలి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పీఏసీ చైర్మన్‌ను ఎక్కడ చులకనగా మాట్లాడలేదు. పీఏసీ చైర్మన్‌ చెబుతున్న రూ.17 వేల కోట్లలో రూ.16,700 కోట్లు టీడీపీ హయాంలో ఎక్సైస్‌గా వాడారు. అలాంటివి ఎల్లో మీడియా రాయడం లేదు. ఏపీకి ఇచ్చే డబ్బుల్లో కోత విధించారని తప్పుడు రాతలు రాస్తున్నారు. ప్రభుత్వంపై ఒక బాధ్యత ఉంది. ఎవరు ఏదైనా సందేశం వ్యక్తం చేస్తే వాటికి ప్రభుత్వం  సమాధానం ఇవ్వాలి. అందుకే ఆర్థిక మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు.

గ్యారంటీ ఇవ్వలేదని చెప్పినా కూడా మళ్లీ అదే అడగటం సరికాదు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించాలని క్రియేట్‌ చేస్తున్నారు. బ్యాంకు గ్యారంటీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదు. స్పష్టంగా చెబుతున్నా కూడా అదే మాట్లాడుతున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రభుత్వం బ్రహ్మండమైన కార్యక్రమాలు చేస్తోంది. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక ప్రజలకు ఎక్కువ సంక్షేమ పథకాలు అందించి మేలు చేస్తున్నారు. మీలాగా ఒక్క బిల్డింగ్‌ కట్టి గ్రాఫిక్స్‌ చేయడం లేదు. వైయస్‌ జగన్‌ ప్రజల జీవన విధానంలో మార్పులు తెస్తున్నారు. చంద్రబాబులా అబద్ధాలను ప్రచారం చేసే తీరు మాది కాదు. మీ ప్రయత్నాలు ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లి పీఏసీ నివేదికలు అందిస్తామంటున్నారు. 

తెలంగాణ రాష్ట్రం డబ్బులు కూడా మనం అప్పుగా పొందుతున్నామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇచ్చేవారు గుడ్డివాళ్లా? తప్పుడు సంకేతాలు పంపించడం సరికాదు. ఆంధ్రరాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. కూడా ప్రజలకు ఇబ్బంది కలుగకూడదని సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య పేర్కొన్నారు. 

 

Back to Top