చంద్రబాబు అందుకు సిద్ధమా?

టీడీపీ బాధితుల సమావేశంలో కాసు మహేష్‌రెడ్డి సవాలు
 

గుంటూరు: చంద్రబాబు పల్నాడుకు వస్తే వాస్తవాలు తెలుస్తాయని, నేనొక్కడినే వచ్చి మీకు ఇక్కడి పరిస్థితిని చూపిస్తానని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడికైనా చర్చకు సిద్ధమని, చంద్రబాబుకు అందుకు సిద్ధమా అని కాసు మహేష్‌రెడ్డి సవాలు విసిరారు.  తెలుగు దేశం పార్టీ బాధితుల సమావేశం పల్నాడులో ఏర్పాటు చేశారు. పిడుగురాళ్ల వాసవీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హోం మంత్రి సుచరిత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టీజీపీ కృష్ణారెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాసు మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ..సీఎం వైయస్‌ జగన్‌ వంద రోజుల పాలన ప్రశాంతంగా సాగిందన్నారు.ఓర్చుకోలేకనే టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశానికి టీడీపీ బాధితులు భారీగా హాజరై తమకు జరిగిన అన్యాయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top