చంద్రబాబుకు విశాఖ అంటే ఎందుకంత ద్వేషం

నమ్మిన ఉత్తరాంధ్ర ప్రజలకు బాబు వెన్నుపోటు 

వార్తలతో ప్రజల్లో గందరగోళానికి పచ్చ మీడియా కుట్రలు

అన్ని ప్రాంతాల అభివృద్ధి సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు విశాఖ అంటే ఎందుకంత ద్వేషమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. అమరావతిలోని భూములు కాపాడుకోవడానికి చంద్రబాబు తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. భూముల రేట్లు పెంచుకోవడానికే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని  తెలిపారు. చంద్రబాబు అమరావతిలో కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడమే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అంటే బాబు గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. నమ్మిన ఉత్తరాంధ్ర ప్రజలను బాబు వెన్నుపోటు పొడిచారని ఫైర్‌ అయ్యారు. అమరావతిలో రాజధాని తరలిస్తామని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలతో ప్రజల్లో గందరగోళానికి పచ్చ మీడియా కుట్రలు చేస్తుందన్నారు. ఇప్పుడు విశాఖ దూరమని చెప్పే పత్రికలు హైదరాబాద్‌ దూరమని ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. చెన్నై, హైదరాబాద్‌లో రాజధాని ఉంటే బాధపడ్డామా అని నిలదీశారు.

Back to Top