కాకినాడ:వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశ్వాసంతో ప్రజలందరూ వైయస్‌ఆర్‌సీపీకి ఘన విజయం అందించారని వైయస్‌ఆర్‌సీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. భారీ మెజారీటీతో గెలిపించిన ప్రజలకు చంద్రశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడితే ఎంత మంచి తీర్పునిస్తారో ఉదాహరణ ఈ ఎలక్షన్లు అని తెలిపారు.50 శాతం ఓట్లు వైయస్‌ఆర్‌సీపీకి రావడం చరిత్రగా అభివర్ణించారు.వైయస్ జగన్ ప్రకటించిన నవరత్న పథకాలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీ కూడా అమలు చేస్తారని తెలిపారు.వైయస్ జగన్ మంచిపాలన అందిస్తారని తెలిపారు.అవినీతి పాలనకు ప్రజలకు చరమగీతం పాడారని. వైయస్ జగన్ సారథ్యంలో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పాలన సాగుతుందన్నారు.