పుట్టపర్తి అభివృద్ధిపై చర్చకు లోకేష్, రఘునాథ్‌రెడ్డి సిద్ధమా..?

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సవాల్‌

ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో టీడీపీ అశాంతి సృష్టిస్తోంది

సత్యసాయి జిల్లా: ప్రశాంతంగా ఉన్న పుట్టపర్తిలో నారా లోకేష్, పల్లె రఘునాథ్‌రెడ్డి అశాంతిని నెలకొల్పారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పాదయాత్రలో లోకేష్‌ ప్రతి ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తూ, టీడీపీ నేతలకు గొడవలకు రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. పుట్టపర్తి అభివృద్ధిపై నారా లోకేష్, పల్లె రఘునాథ్‌రెడ్డి సిద్ధమా అని సవాల్‌ విసిరారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం పుట్టపర్తిలో చేపట్టిన అభివృద్ధిపై చర్చించేందుకు న్యూట్రల్‌గా ఉన్న న్యూస్‌ ఛానల్స్‌ డిబేట్‌కైనా తాను సిద్ధమని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పుట్టపర్తిని అనేక రకాలుగా అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చెప్పారు. భగవాన్‌ శ్రీసత్యసాయిబాబా పేరుతో జిల్లాను సాధించుకున్నామన్నారు. పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మూడు సంవత్సరాలు మంత్రిగా, రెండు సంవత్సరాలు విప్‌గా ఉన్న దద్దమ్మ పల్లె రఘునాథ్‌రెడ్డి.. పుట్టపర్తిని అభివృద్ధి చేశాడా అని ప్రశ్నించారు. లోకేష్‌ తన పాదయాత్రలో ప్రతి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. లోకేష్‌తో చర్చకు సత్యమ్మ గుడి దగ్గర తాను సిద్ధంగా ఉన్నానని, సవాల్‌ విసిరిన లోకేష్‌ తోకముడిచి పారిపోయాడని ఎద్దేవా చేశారు. మా ముఖ్యమంత్రిపై, మా ప్రభుత్వంపై అడ్డగోలు మాటలు మాట్లాడుతూ తొడలు కొడితే మా కార్యకర్తలు, జగనన్న అభిమానులు ఊరుకోరని లోకేష్, పల్లె రఘునాథ్‌రెడ్డిని హెచ్చరించారు. 
 

Back to Top