అమరావతి: చంద్రబాబు చేతకానితనం వల్ల రాష్ట్రం లక్షల కోట్లు అప్పుల్లో ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఏపీకి నష్టాలే అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో గోలుమాల్ జరిగిందని చెప్పారు. విద్యుత్ పీపీఏలపై శుక్రవారం ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. గత ప్రభుత్వం మనకు ఉన్న ఆబ్లిగేషన్ 9 శాతం అయితే 22.6 శాతం అగ్రిమెంట్‌లో కొనుగోలు చేశారు. రూ.1.10 థర్మల్ మనం ప్రోడ్యూస్ చేయడం లేదని మళ్లీ ఖర్చు చేశారు. ఇది ఒక రకమైన స్కామ్ జరిగింది. మనం కొనాల్సిన 12 శాతం పూర్తి చేయాల్సి ఉండగా రెన్యువల్ పవర్ 22 శాతం కొనుగోలు చేశారని తెలిపారు. సోలార్ రూ.7.10 చొప్పున కొనుగోలు చేశారు. ఈ రాష్ట్రానికి దాదాపుగా రూ.3 వేల కోట్లు నష్టపోవాల్సి ఉంది. చంద్రబాబు కేంద్రం నుంచి వచ్చే సెంట్రల్ ఇన్సెటివ్స్ వస్తుందని ఏపీకి నష్టం చేయడం ఎవరి సొమ్ము అనిప్రశ్నించారు. ఏపీ ఈ రోజు రూ.3 లక్షల కోట్లు అప్పులు అయ్యిందంటే చంద్రబాబు పుణ్యమే అన్నారు. ఇది ప్రజల సొమ్ము కాదా? ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు. ఏపీఎస్‌ఈబీ ఉన్నప్పుడు గతంలో లాభాల్లో ఉండేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 1996–1997వ సంవత్సరంలో నష్టాల్లోకి నెట్టారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఏపీకి నష్టాలే అని చెప్పారు. విద్యుత్ పీపీఏలపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ టారీఫ్‌లు గణనీయంగా తగ్గిపోతే..ఏపీలో మాత్రం విఫరీతంగా పెరిగాయని, దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. రూ.3 వేల కోట్లు నష్టపోయి ..కేంద్రం నుంచి రూ.226 కోట్ల ఇన్సెటివ్ వచ్చిందని చెప్పుకున్న ఏకైక వ్యక్తి చంద్రబాబే అన్నారు. తుగ్లక్‌ను ఈయన బాగా ఫాలో అయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. స్వార్థ ప్రయోజనాలకు ఏపీని తాకట్టుపెట్టారని విమర్శించారు. మా నాయకుడు వైయస్ జగన్ రైతులకు ఉచితంగా విద్యుత్ 9 గంటలు పగటిపూట ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. ఈ పథకాలకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు అడ్డంకిగా మారాయని చెప్పారు. ఈ స్కామ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. హైడ్రో, విండ్, సోలార్, బయో గ్యాస్ కలిసి అబ్లిగేషన్ పుల్‌ఫిల్ చేయాల్సి ఉందన్నారు. వీటిని నింపుకొని ఉంటే మనకు ఉన్న ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలు లాభాలబాట పట్టేవన్నారు. షెడ్ డీల్స్ వల్లే ఏపీకి నష్టాలు వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. 2004–2009వ సంవత్సరంలో వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో డిస్ట్రిబ్యూటరీలన్నీ లాభాల్లో ఉండేవని, చంద్రబాబు వచ్చిన తరువాతే నష్టాల్లోకి నెట్టబడుతున్నాయని, వీటిపై విచారణ జరిపించాలని దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కోరారు. వైయస్ జగన్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు, బలహీన వర్గాలను ప్రగతిపథంలో నడిపిస్తాయని, రైతులకు మంచి రోజులు వచ్చాయని, అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుందన్నారు. కచ్చితంగా ఆరు నెలల్లో వైయస్ జగన్‌ను దేవుడిలా గుండెల్లో పెట్టుకునే రోజులు ఆసన్నమయ్యాయని చెప్పారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టిన విద్యుత్ బడ్జెట్‌కు శ్రీధర్‌రెడ్డి మద్దతు తెలిపారు. మంచి రేట్లతో లోయేస్టు పీపీఏలు ఈసుకువస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.