కష్టాలు ఓర్చుకొని ప్రజల కోసం నిలబడ్డారు

ఐదు కోట్ల ప్రజల ఆదరించిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి

వెలగపూడి: తొమ్మిది సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక రకాల కష్టాలు, నష్టాలు ఓర్చుకొని ప్రజల కోసం నిలబడిన నాయకుడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో భూమన మాట్లాడుతూ.. దారుణమైన వ్యక్తిగత దాడులు చేసినా చెక్కు చెదరని గుండెనిబ్బరంతో తండ్రి ఆశయాలను కొనసాగించేందుకు చివరి శ్వాస వరకు బతుకుతానని నడుం బిగించి రాష్ట్రంలోని కోట్లాది మందిని ఆదరాభిమానాలు చురగొని ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ నిలిచారన్నారు. తన ఆశయాలను గవర్నర్‌ గొంతు ద్వారా ప్రతిబింబించారన్నారు. గత ప్రభుత్వం 600ల హామీలు ఇస్తే.. మూడు రోజుల క్రితం గవర్నర్‌ చదివి వినిపించిన ప్రసంగం సీఎం వైయస్‌ జగన్‌పై ప్రజలందరికీ విశ్వాసం కలిగిందన్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఐదు కోట్ల మంది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకోవడం వెనుక ఆయన పోరాటం, మనో నిబ్బరం ఉన్నాయన్నారు. ఆశయం కోసం కాకుండా.. తండ్రి ఆశయాలను కొనసాగించేందుకు బతుకుతానన్న వైయస్‌ జగన్‌ ఆలోచనను ప్రజలంతా అర్థం చేసుకొని ముఖ్యమంత్రిగా నిలబెట్టారన్నారు. 

ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయని పాదయాత్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేశారని భూమన అన్నారు. ప్రజల కష్టాలన్నీ కళ్లారా చూసి నేనున్నానని ధైర్యం కల్పిస్తూ.. అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి అయిన తరువాత సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పది రోజుల్లోనే ఒకొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. రెండు పేజీలతో మేనిఫెస్టో తయారు చేశారని, దాన్ని ఖురాన్, బైబిల్, భగవద్డీతలా భావిస్తానని చెప్పిన ఏకైక నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని భూమన అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఏ విధంగా ఉండబోతుందనేది ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులను చూస్తే అర్థం అవుతుందన్నారు. ఆశా వర్కర్లకు రూ. 3 వేలు ఉన్న వేతనాన్ని రూ. 10 వేలకు పెంచారన్నారు. ప్రతి కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు.

Back to Top