ప్రభుత్వం మారిన మీ తీరు మారదా?

రూయా ఆసుపత్రి వర్గాలపై ఎమ్మెల్యే భూమన ఫైర్‌
 

తిరుపతి: రూయా ఆసుపత్రి వర్గాలపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల తనయుడి బినామీలు అక్రమాలకు పాల్పడుతుంటే రూయా ఆసుపత్రి వర్గాలు ఎందుకు సహకరిస్తున్నాయని ప్రశ్నించారు. కోడెల కుటుంబీల అక్రమార్జనలో మీకు వాటాలు ఉన్నాయా అని నిలదీశారు. నెలనెల రూ.40 లక్షల చొప్పున దోచుకుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం మారినా మీ తీరు మారదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ చెప్పిన తర్వాత కూడా కోడెల కుమారుడి బినామీ ల్యాబ్‌ను ఎందుకు మూయలేదని ధ్వజమెత్తారు.సాయంత్రంలోగా అక్రమ ల్యాబ్‌ను మూసేయాలని భూమన ఆదేశించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top