రూ.371 కోట్లు తిన్న బాబును అరెస్టు చేస్తే తప్పేంటి..?

అవినీతి బాబు ఇన్నాళ్లకు సరైనోడు చేతికి చిక్కాడు

దశాబ్దాలుగా స్కాములు చేస్తూ.. చంద్ర స్వామీజీలా ఫోజులు కొట్టాడు

చంద్ర‌బాబు అరెస్టు నుంచి.. జైలు వరకు ఎక్కడా కక్షసాధింపులు లేవు

పాపాల భైరవుడు బాబు సిగ్గు పడకుండా.. వేళ్లు ఊపుకుంటూ జైలుకెళ్తున్నాడు

కోటిన్నర ఇచ్చి తెచ్చిన ప్లీడర్ కూడా బాబు అవినీతి చేయలేదని వాదించలేదు

అవినీతిపై రాజీలేని  పోరాటం అంటే.. వాటా కోసం రోడ్ల మీద పోరాటమా పవన్..?

అవినీతి బాబుకు పవన్ మద్దతా.. ఇదేం పొయ్యేకాలం

 కూలికి పనిచేసే కార్యక్రమం ఇంకెన్నాళ్ళు పవన్ కల్యాణ్

ఢిల్లీ పెద్ద‌ల‌కు చెప్పి ఆట ఆడిస్తానన్నావు కదా.. నీకు చేతనైతే ఆడించు

ప‌వ‌న్‌కు వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స‌వాల్‌

తాడేప‌ల్లి: నూరు గొడ్లను తిన్న రాబందు.. ఒక్క సరైన తుపానుకు నేలకూలినట్టు.. ఇన్నేళ్లుగా త‌ప్పులు చేసుకుంటూ ఎవరికీ చిక్కకుండా నీతిమంతుడుగా చలామణి అవుతున్న చంద్ర‌బాబు.. స్కిల్ స్కామ్‌లో ప‌క్కా ఆధారాల‌తో సీఐడీ అధికారులకు చిక్కాడని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇన్నాళ్ల‌కు చంద్ర‌బాబు పాపం పండింద‌ని, సరైనోడు చేతికి చిక్కాడని, స్కిల్ స్కామ్ కేవలం తీగ మాత్రమేన‌న్నారు. చంద్రబాబు ఎంతో అవినీతి, ఎన్నో అక్రమాలు చేసినా.. ప్రభుత్వాలుగానీ, వ్యవస్థలుగానీ ఎంత పోరాటం చేసినా, తన కుయుక్తులు, నక్క జిత్తులతో పట్టుబడకుండా, స్టేల మీద వ్యవస్థలను ఏమార్చుకుంటూ 45 ఏళ్లుగా చక్రం తిప్పుతూ వ‌చ్చి స్కిల్ స్కామ్‌లో దొరికిపోయాడ‌న్నారు. చదువుకున్న లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్మెంటు ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి స్కీము పెట్టి రూ. 371 కోట్లు దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పేర్ని నాని విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..

ఇన్ని దశాబ్దాలకు చంద్రబాబు చట్టానికి చిక్కాడు. 1978 నుంచి చట్టానికి దొరక్కుండా, న్యాయస్థానాలను ఎల్లకాలం ఏమార్చడం సాధ్యం కాదు అని రుజువైంది. ఇన్నాళ్ల‌కు తెలుగువారికి న్యాయస్థానాల మీద విశ్వాసం పెరగటానికి, ఇంతకాలానికి న్యాయం, ధర్మం గెలిచిందని  గొప్ప అనుభూతి తెలుగు ప్రజలకు కలిగింది. 45 ఏళ్లుగా ఎన్నో స్కాములు చేస్తూ.. స్టేల మీద నెట్టుకొస్తూ.. ప్రతి వ్యవస్థలోనూ, తాను ఏర్పాటు చేసుకున్న స్లీపర్ సెల్స్ ద్వారా బయటపడుతూ, సమాజానికి మాత్రం చంద్ర‌స్వామీజీ నీతులు చెబుతున్నాడు. ఆఖరికి, తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఓటు కోసం లంచం ఇస్తూ ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో, వీడియోల ద్వారా పచ్చిగా దొరికిపోయి, పదేళ్లు ఉమ్మడి రాజధానిగా అనుభవించాల్సిన హైదరాబాద్ నగరాన్ని కూడా వదిలేసి వచ్చాడు.

చంద్ర‌బాబు అరెస్టుపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దగ్గర నుంచి, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్, సీపీఐ నాయకులు వీరంతా బాబును వేధిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబే అరెస్టుకు రెండు రోజులు ముందు తనను అరెస్టు చేస్తారని చెప్పాడంటే తప్పు చేశాడని తనకు కూడా తెలుసు. ఇక్కడ వేధింపులు ఎక్కడున్నాయి. సీఐడీ వారు వస్తారని తెలిసే, నంద్యాలలో బస్సులో పడుకుని డ్రామాలు ఆడింది నిజం కాదా చంద్రబాబూ..? దీనికి చంద్రబాబు బస్సు డోర్ కొట్టారని, ఆయనకు నిద్రా భంగం కలిగించారని ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు తప్పుడు రాతలు రాస్తారు. వైయ‌స్‌ జగన్ అరెస్టు అయితేనేమో ఏ1 ముద్దాయి అరెస్టు అని ఈనాడు రామోజీ హెడ్ లైన్లు పెడతాడు. చంద్రబాబు అరెస్టు అయితేనేమో ప్రజాస్వామ్యం ఖూనీ అని రాస్తారు. రామోజీకి ఎందుకంత కులపిచ్చి. మరోవైపు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు లంచాలు తింటాడు. హేబిచువల్ కరెప్టెడ్ అని చెప్పకనే చెబుతాడు కానీ, ఈ వయసులో, ఇంత సీనియర్ లీడర్‌ను ఎలా అరెస్టు చేస్తారు అన్నట్టు ఎల్లో రాతలు రాస్తాడు. 

ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోతే ఏమవుతుంది- ఇన్వెస్టిగేషన్‌లో, విచారణలో తేలిన తర్వాత ఎఫ్ఐఆర్‌లో నమోదు చేస్తారు. దానికి నానా రాద్ధాంతం చేశారు. వైద్య పరీక్షలప్పుడు కూడా నాకు ఏ సమస్యలు లేవని చెప్పింది మీరే కదా.. వైద్య పరీక్షల కోసం కనీసం ఆయన చొక్కా అయినా విప్పాడా? ఆఖరికి మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పినట్టు డినైడ్ మెడికల్ రిపోర్ట్స్ అని రాసుకున్నారు కదా..

45 ఏళ్ల‌ ఇండస్ట్రీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు అనే కదా.. చంద్రబాబును ప్రతి అంశంలోనూ గౌరవించింది. ఆయనను నంద్యాల నుంచి హెలికాఫ్టర్ లో తీసుకొస్తామంటే తానే వద్దన్నాడు. చిలకలూరిపేట, మంగళగిరి వద్ద టీడీపీ కార్యకర్తలు కొందరు పోగైతే.. మిమ్మల్ని కలవనిచ్చారు కదా.. ఆ తర్వాత నీ కొడుకును, భార్యను, కోడల్ని కూడా కలవనిచ్చారు కదా.. మీరు సీఐడీకి అసలు సహకరించారా.. లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు.. ఏమో- తెలియదు- గుర్తు లేదు.. ఈ మూడే కదా బాబు చెప్పింది.

చంద్రబాబు స్కిల్ స్కామ్ లో తినేశాడని సాక్ష్యాధారాలు చెబుతుంటే.. మేధావుల ముసుగులో మాసిపోయిన కోట్లు వేసుకుని టీవీల్లో కూర్చున్నవాళ్లు, ఈ ఎల్లో ఛానళ్ల వాళ్లు.. ఏం చెబుతారు. 80 ఏళ్ల‌ వయసులో చంద్రబాబును ఇబ్బంది పెడతారా.. జైల్లో పెడతారా.. అని వాగుతారు. కోర్టులోకి మీ కుటుంబ సభ్యులంతా వస్తుంటే.. పోలీసులు అనుమతించారా.. లేదా..? మందులు వేసుకోవాలి, మేకప్ చేసుకోవాలని.. హౌస్ అరెస్ట్ కు ఇమ్మని మీ లాయర్లు అడిగితే.. జైల్లో ఆయనకు సకాల సౌకర్యాలు ఇవ్వమని ప్రభుత్వం తరఫున, సీఐడీ తరఫున న్యాయవాదులు నో అబ్జెక్షన్ చెప్పారా? లేదా?  చంద్రబాబును ఇంత మర్యాదగా చూస్తే.. వేధించారని మాట్లాడతారా..?

బాబు త‌ర‌ఫున వాదించే అడ్వ‌కేట్‌కి రోజుకు కోటిన్నర-రెండు కోట్ల రూపాయ‌ల‌ ఫీజు అంటున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్ 409 కింద ఎలా వస్తాడు, గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారా..? రిమాండ్ లోకి తీసుకున్న 24 గంటల తర్వాత ఎలా కోర్టుకు పెడతారు.. ఇలా వాదించాడు తప్పితే.. చంద్రబాబు అవినీతి చేయలేదను ఎక్కడా వాదించలేదు. స్కిల్ లో స్కాము జరగలేదు. లక్షల మంది పిల్లలకు నైపుణ్యం నేర్పించాము.. అసలు అవినీతి జరగలేదు అని చంద్రబాబుగానీ, ఆయన ప్లీడర్లు గానీ చెప్పారా.. చెప్పలేదు. ఎంతసేపటికీ టెక్నికల్ గా కుంటి సాకులు చూపించి తప్పించుకోవాలని చూశారు. 

మీ పాపాలు పండాయి. దొరికింది తీగ మాత్రమే. మీ అవినీతికి సంబంధించి సాక్ష్యాధారాలన్నీ కోర్టు పరిశీలించింది. సీమెన్స్ అనే జర్మనీలో పేరున్న కంపెనీ పేరు మీద, ఒక  బోగస్ కంపెనీ పెట్టి, డిజైన్ టెక్ పేరుతో ప్రభుత్వానికి చెందిన రూ. 371 కోట్లు ఇచ్చి, గంటా సుబ్బారావు అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి, స్కిల్ డెవలప్ మెంటు పేరుతో ఒక కార్పొరేషన్ పెట్టి, ఆ శాఖకు అతన్నే సెక్రటరీని చేసి, ఆ శాఖకు మంత్రిగా కూడా చంద్రబాబే ఉన్నారు. ఈ స్కాంలో ఫైలు ప్రారంభమైనప్పటి నుంచీ.. అంతమయ్యే వరకు గంటా సుబ్బారావు- చంద్రబాబులు తప్పితే మరొకరు లేరు. జీఎస్టీ కోసం ఆ కంపెనీలు దరఖాస్తు చేస్తే.. జీఎస్టీలోని అధికారులు దీనిని బయటకు లాగారు. దీనికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. ఆ ఫైళ్ళన్నీ మాయం చేశారు. దీనికి సంబంధించి, ఐఏఎస్ అధికారులు సునీత, పీవీ రమేష్.. మరికొందరు అడ్డుకున్నా.. చంద్రబాబు ప్రత్యేక ఇంట్రస్ట్ తో ఈ స్కామ్ చేశారు. చంద్రబాబు ఒత్తిడి వల్లే ఈ డబ్బు విడుదల చేశామని జడ్జి దగ్గర 164 స్టేట్ మెంటు ఇచ్చారు. 

ఇంత పచ్చిగా, దగా చేస్తే.. చంద్రబాబు అనుభవాన్ని చూసి వదిలేయాలా..?. ఈ కుంభకోణంలో నష్టపోయింది పేద విద్యార్థులు కాదా.. చంద్రబాబు అవినీతి చేసి, దోచేస్తే కూడా ఏమీ పట్టించుకోవద్దా..? ప్ర‌ధాని మోడీ ప్రభుత్వం ఇంటర్నెట్ కోసం ఒక రూ. 5 వేల కోట్లు ఇస్తుందని తెలిసి, చంద్రబాబు, ఆయన కొడుకు కలిసి ఫైబర్ నెట్ స్కామ్ చేశారు. అలానే అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి, కాంట్రాక్టుల పేరుతో రూ. 119 కోట్లు లూటీ చేసినా.. ఏం పట్టించుకోకూడదా..? దీన్ని కూడా తేలిగ్గా మాట్లాడుతూ.. ఐటీ నోటీసులిస్తే.. చంద్రబాబు అవినీతిపరుడని ఎలా అంటారు అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. ఇదేం పొయ్యేకాలం. 

చంద్రబాబు రూ. 2వేల కోట్ల అవినీతికి సంబంధించి.. నీ మాజీ పీఎస్ శ్రీనివాస్, నీ హవాలా స్కామ్ పార్టనర్ ఎంవీపీ- మనోజ్ వాసుదేవ్ పార్థసాని లు అమెరికాకు, దుబాయ్ కు పారిపోయారు. మరోవైపు 5 ప్రత్యేక విమానాలు పెట్టి.. చంద్రబాబు కోసం, మనుషుల్ని తెచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ కూడా అలానే వచ్చాడు. పాపాల భైరవుడు చంద్రబాబు ఇన్ని దుర్మార్గాలు చేసి సిగ్గు పడకుండా.. వేళ్లు ఊపుకుంటూ వెళుతున్నాడు. 

ఎక్కడా కక్ష అనేది లేకుండా, వేధింపులు లేకుండా, మీ ఎల్లో మీడియా సాక్ష్యంగా, ఆయన స్వదస్తూరితో ఆయనను అరెస్టు చేస్తున్నామని సంతకం పెట్టించుకున్న దగ్గర నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు గేటు దగ్గరకు పంపే వరకు.. ఎక్కడైనా కక్ష ఉందా..? ఇన్ని వందల, వేల కోట్లు కొట్టేసిన వారిని ఎవరైనా ఇంత మర్యాదగా చూస్తారా..? మాకు ఆయనపై మర్యాద, గౌరవం తప్పితే.. చంద్రబాబు పట్ల కక్ష అనేది లేదు. ఆయన స్కిల్ స్కాము పేరుతో రూ. 371 కోట్లు దోచుకున్నాడనే ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తించింది. ఒక నేరం జరిగితే.. దొంగ దొరికితే.. అతన్ని విచారించి, ఎలా అయితే కోర్టులో ప్రవేశపెడతామో అలానే చంద్రబాబును అరెస్టు చేశాము. అధికారం నుంచి దిగిపోయేటప్పుడు చివరిలో నాకు ఆ శాఖ ఇస్తే.. నా పేరు ఎలా పెడతారని అచ్చెన్నాయుడు అంటున్నాడు. చంద్రబాబే దోచుకున్నాడని, అచ్చెన్నాయుడుతో సహా వారందరికీ తెలుసు కాబట్టే, అలా మాట్లాడుతున్నారు. 

చంద్రబాబును అరెస్టు చేస్తే.. లోకేష్ ఏమో బస్సు టైరు దగ్గర నేల మీద కూర్చుంటే.. చంద్రబాబు దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేసేందుకు పవన్ కల్యాణ్ ఏకంగా హైవే మీద పొర్లాడాడు. జనసేన పార్టీ ఆలోచన సిద్ధాంతం- కులాలను కలిపే ఆలోచనా విధానం అన్నాడు. కమ్మ-కాపులను కలిపే ఆలోచనా విధానం ఆయనది. మతాల ప్రస్తావన లేదంటూనే.. నిత్యం మతాల గురించి మాట్లాడతాడు. నేతి బీర కాయలో మాదిరిగా జనసేన సిద్ధాంతాలు ఉన్నాయి. అవినీతిపై రాజీ లేని పోరాటం అని జనసేన సిద్ధాంతం పెట్టి.. అవినీతి బాబు కోసం రోడ్ల మీద పొర్లాడతాడా..?

కేంద్ర నిఘావర్గాల్లోని అత్యున్నత స్థాయి వాళ్ళు చెప్పారని 2 వేల మంది కిరాయి రౌడీలు ఆయన వారాహిని చుట్టుముట్టారని మాట్లాడతాడు. ఢిల్లీ పెద్దలు మమ్మల్ని మందలించారని ఆగిపోయామని చెబుతాడు. సినిమా రచయితలతో డైలాగులు రాయించుకుంటే బాగుంటుంది కానీ.. సినిమా డైలాగులను తెచ్చి, రాజకీయాల్లో పెడితే ఎలా..?. ఇదేమైనా జానీ సినిమానా? అజ్ఞాతవాసి సినిమానా..?

పవన్ కల్యాణ్.. ఫిట్ ఫర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి కేసు. ఆయన విజయవాడలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న సైక్రియాట్రిస్టు. పవన్ కల్యాణ్ కు ఉన్నది సైకలాజికల్ డిజార్డర్. చంద్రబాబు అవినీతికి వ్యతిరేకంగా పోరాడాల్సింది పోయి.. ఆయన అవినీతిలో వాటాలు ఉన్నవారే.. చంద్రబాబు అనుభవజ్ఞుడని, గొప్పోడని తప్పుడు ఆర్గుమెంట్లు చెబుతారు. చంద్రబాబు రూ. 371 కోట్లు ఎత్తేశాడా.. లేదా అని పవన్ కల్యాణ్ చెప్పాలి. కూలికి పనిచేసే కార్యక్రమం ఇంకెన్నాళ్ళు పవన్ కల్యాణ్. చంద్రబాబును అరెస్టు చేస్తే.. టీడీపీ కార్యకర్తలే బయటకు రాకపోతే.. పవన్ కల్యాణ్ హడావుడి ఏమిటి..? పవన్ కల్యాణ్ కు ఛాలెంజ్ విసురుతున్నాను. మీడియా ముందు సొల్లు కబుర్లు తప్పితే.. ఢిల్లీ వాళ్ళకు చెప్పి ఆట ఆడిస్తానన్నావు కదా.. నీకు చేతనైతే ఆడించు. పవన్ కల్యాణ్ చెప్పే నిఘా వర్గాలు కేంద్రానివి కాదు.. చంద్రబాబు నిఘా వర్గాలు. చంద్రబాబు రూ. 371 కోట్లు తింటే.. ఆయనకు మద్దతుగా బంద్ కు పిలుపేంటి..?.నీ దొక పార్టీయేనా..?

Back to Top