టీడీపీ తెరమరుగవ్వడం ఖాయం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయతకు జనం జేజేలు కొడుతున్నారని, తిరుపతి ఉప ఎన్నికలో గురుమూర్తి విజయం ఖాయమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శంఖారావం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. నెల్లూరులో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాదరణతో వైయస్‌ఆర్‌ సీపీకి అద్వితీయమైన బలం వచ్చిందన్నారు. ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి గురుమూర్తికి భారీ మెజార్టీ వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ త్వరలో తెరమరుగవ్వడం ఖాయమన్నారు. నారా లోకేష్‌ అవహగాన లేకుండా మాట్లాడుతున్నాడని, లోకేష్‌కు ఇంకా రాజకీయ పరిణితి రాలేదన్నారు. బీజేపీ జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయికి దిగజారిపోయిందన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top