ఇంతకీ కోడెల శివప్రసాద్‌ సెల్‌ఫోన్‌ ఏమైనట్టు..!

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

గుంటూరు: వెన్నుపోటు పోడవడం, దండేసి పొగడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి అనేక పదవులు నిర్వహించిన అరుదైన నాయకుడు కోడెల శివప్రసాద్‌ అని గుర్తుచేశారు. కోడెల శివప్రసాద్‌ జయంతిని పురస్కరించుకొని అతని ఆత్మహత్యను వైయస్‌ఆర్‌ సీపీ మీదకు నెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడన్నారు.  ఓటమి చెందిన తర్వాత కోడెల పట్ల చంద్రబాబు దుర్మార్గ వైఖరే ఆత్మహత్యకు కారణమని అంబటి వివరించారు. ఇంతకీ కోడెల శివప్రసాద్‌ సెల్‌ఫోన్‌ ఏమైనట్లు. ఫార్మాట్‌ చేయకుండా బయటపెట్టగలరా.. అని చంద్రబాబును నిలదీశారు.

Back to Top