రాజధాని ప్రాంత రైతులకు ఇబ్బంది ఉండదు

ఎమ్మెల్యే అంబటి రాంబాబు
 

అమరావతి: కార్యనిర్వాకహ రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించడం వల్ల అమరావతి ప్రాంతానికి ఎలాంటి నష్టం వాటిల్లదని సలె ్తనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆయన గురువారం సీఎం క్యాంపు ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణం అంటే పట్టణాల నిర్మాణం కాదని రాంబాబు అన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.1.09 లక్షల కోట్ల అంచనా వేస్తే.. ఈ అయిదు సంవత్సరాల్లో రూ.5800కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. దీనిపై  రూ.700 కోట్లు వడ్డీలు కడుతున్నామని అన్నారు. 
అంతా తాత్కాలికమే..
అమరావతిలో ఇప్పుడున్నవన్నీ తాత్కాలిక సెటప్‌లేనని రాంబాబు అన్నారు. దీన్ని అభివద్ధి చేయడానికి రూ.1లక్ష కోట్లకు పైగా నిధులు వెచ్చించాలని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం వల్ల అంత ఖర్చు ప్రభుత్వం చేయలేదని ఆయన పేర్కొన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఉంది కాబట్టే ఈ నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్నారన్నారు.

 

Back to Top