సిట్‌ వేయడంతో చంద్రబాబు అండ్‌ కో భయపడుతున్నారు

  గుంటూరు: సిట్‌ వేయడంతో చంద్రబాబు అండ్‌ కో భయపడుతున్నారని, అవినీతి, అక్రమాలు ఎక్కడ బయట పడతాయోనని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భయం పట్టుకుందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. . వ్యవస్థలను మ్యానేజ్‌ చేసి రైతులు, ప్రభుత్వాన్ని చంద్రబాబు తప్పుదారి పట్టించారని ఆయన మండిపడ్డారు. రాజధానిలో పోలీస్‌, రెవెన్యూ అధికారులను అడ్డుకోవడం సరికాదన్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని రాజధాని రైతులకు  ఎమ్మెల్యే ఆర్కే సూచించారు.

తాజా వీడియోలు

Back to Top