ఆ విషయంలో ఇతర రాష్ట్రాలకంటే మనకే ఎక్కువ నిధులు

ఉపాధి హామీ నిధులు రాబట్టేందుకు కృషిచేస్తున్నాం

పనిగట్టుకొని ప్రభుత్వంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం

వైయస్‌ఆర్‌ సీపీ లోక్‌సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజం

న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మండిపడ్డారు. జాతీయ రహదారుల విషయంలో ఏ రాష్ట్రానికి రాని నిధులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలమంతా కృషి చేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెలకొల్పిన వైయస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఏపీకి వస్తున్నాయన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ వాటర్‌ గ్రిడ్‌ పథకం కింద రాష్ట్రంలో సురక్షిత జలాలు అందిస్తున్నామని చెప్పారు. అయినా తెలుగుదేశం పార్టీ నేతలు వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. 
 

తాజా వీడియోలు

Back to Top