తాడేపల్లి: సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ అరెస్టును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఖండించారు. అరెస్టులకు ఆస్కారం లేని కేసుల్లో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించేవారిని చూసి చంద్రబాబు భరించలేకపోతున్నారన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులపై కచ్చితంగా కోర్టులకు పిర్యాదుచేస్తామని హెచ్చరించారు. వేధింపులకు దిగినా, హింసించినా తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ అరెస్టులకు దిగుతున్నారని చెప్పారు. పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు కచ్చితంగా తోడుగా నిలుస్తామన్నారు. మరోవైపు రవికిరణ్‌కు అండగా నిలిచేందుకు మాజీ మంత్రి పేర్నినాని, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ గుడివాడకు వెళ్లారు. న్యాయపరంగా రవికిరణ్‌కు తోడుగా నిలుస్తామన్నారు.