వైద్య విద్యలో పిపిపి విధానం వద్దు 

కాకినాడ జిల్లా జేసీకి వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ టీమ్ విన‌తి

కాకినాడ‌: వైద్య విద్యారంగంలో పిపిపి విధానం వద్దని వైయ‌స్ఆర్‌సీపీ కాకినాడ జిల్లా లీగ‌ల్ సెల్ నాయ‌కులు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ రాహుల్ మీనాకు శుక్ర‌వారం లీగ‌ల్ టీమ్ విన‌తిప‌త్రం అంద‌జేసింది. ఈ సంద‌ర్భంగా లీగ‌ల్ సెల్ నాయ‌కులు మాట్లాడుతూ.. వైద్య విద్య కళాశాలలను పిపిపి విధానంలో నిర్వాహణ చేస్తామంటే వైద్య కళాశాలల నిర్వహణ బాధ్యత నుంచి ప్రభుత్వం పరోక్షంగా వదిలించుకుని, ప్రయివేటు వారికి వైద్య విద్యను అప్పగించడమేనని అన్నారు.  కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారి ఆర్ధిక విధానం అవ‌లంబిస్తూ కార్పొరేట్‌ లకు వైద్య విద్య తాకట్టు పెట్టడానికి పిపిపి మోడల్‌ తీసుకొచ్చిందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.8 వేలు కోట్ల ఖర్చు పెట్టి మెడిక‌ల్ కాలేజీలు కట్టలేక పిపిపి పేరుతో ప్రయివేటీకరణ చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Back to Top