ఆక్వా రైతులను గాలికి వదిలేశారు

పశ్చిమగోదావరి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు

పశ్చిమ గోదావరి జిల్లా : ఏపీలో ఎక్కడ చూసినా అరాచక పాలనే కొనసాగుతుందని, ఆక్వా రైతుల‌ను గాలికి వ‌దిలేశార‌ని పశ్చిమగోదావరి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు మండిప‌డ్డారు.  ఇచ్చిన హామీలను గాలికొదిలేసి అరాచక పాలన సాగిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ప్రస్తుత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారేనన్నారు.  శనివారం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు  ముదునూరి నాగరాజ వర ప్రసాద రాజు, మాజీ మంత్రి  కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ నాయకులతో కలిసి రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు  వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  ‘ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. జిల్లాలో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా సమయంలో ఆక్వా రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసారు.

రాష్ట్రంలో అరాచక పాలనకు సాగుతుంది. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తణుకులో ఎమ్మెల్యే  గోవద ప్రోత్స హిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లు కూల్చుతున్నారు. పేదలకు ప్రత్యామ్నాయం  చూపకుండా వారి ఇళ్లు కూల్చేస్తున్నారు. మీరు పేదలకు ఎన్ని ఇళ్లు  నిర్మించారు. అధికార బలంతో నిరుపేదల ఇబ్బంది పెట్టడం సరికాదు. ఆక్రమణల పేరుతో పేదలను నిరాశ్రయులు చేయడం సరికాదు. ఇరిగేషన్ మంత్రి ఉన్నా డెల్టా ఆధునీకరణ ఊసే లేదు. వశిష్ట గోదావరి బ్రిడ్జి నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. మేము అభివృద్ధికోరుతున్నాం.. అరాచకం కాదు. రాష్టంలోపక్షపాత కక్ష పూరిత పాలన సాగుతుంది. మేము స్యాచురేషన్ పద్ధతిలో పథకాలు ఇచ్చాం. ఈ ప్ర‌భుత్వం ఆక్వా  ఫీడ్ సీడ్ ధరలు కట్టడి లేదు. నిరుపేదలకు, రైతులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది’ అని ప్రసాద్ రాజు తెలిపారు.

సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టి..
అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ అని ఊదరగొట్టి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట్ నాగేశ్వరావు మండిపడ్డారు. ‘సెంటు భూమి సమాధి కి కూడా సరి పోదు అన్న మీరు 3సెంటు భూమి ఇచ్చారా.?, పాలకోడేరులోపేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం. పేదలను హింసించడం సరికాదు.  మేము 32 లక్షల ఇళ్లు ఇచ్చాము.. మీరు పేదల ఇళ్ల ఇవ్వాలన్న వూసేలేదు. ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు అది ఈ కూటమికి పాలనకు సిగ్గు చేటు. నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు లో చేతులు ఎత్తేశారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి.’ అని కారుమూరి డిమాండ్ చేశారు.

Back to Top