నెల్లూరు: వైయస్ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో వైయస్ఆర్‌సీపీ నాయకులు మీద పెడుతున్న అక్రమ కేసులపై జిల్లా ఎస్పీకి రీజనల్ కో-ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, సిటీ ఇన్‌చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి గారు, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ చార్జ్ కిలివేటి సంజీవయ్య కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో పార్టీ నాయకులు మాట్లాడారు. కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలనను పూర్తిగా గాలికొదిలేసింది వైయస్ఆర్‌సీపీ నేతలే టార్గెట్ గా...కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి.. .. జైల్లో పెడుతోంది ఇటీవల నెల్లూరు పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన సమయంలో.. వైయస్ఆర్‌సీపీ నేతలను ఇబ్బంది పెట్టేలా కూటమి ప్రభుత్వం చేసిన కుట్రలు అందరికి తెలిసినవే. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు నేతలు.. వైయస్ జగన్ పర్యటనకు రాకుండా, రహదారుల్లో గుంతలు తీయడం, బారికేడ్లు ఏర్పాటు చేయడం.. వస్తున్న వారిని ఎక్కడికి అక్కడ అడ్డుకొని అరెస్టులు చేయడం చూసాం ఇలాంటి దుష్ట సంస్కృతిని రాష్ట్రంలో ఎన్నడూ చూడలేదు అయినప్పటికీ వైయస్ జగన్‌ను కలిసేందుకు వేలాదిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తే.. ఈ రోజు వారిపై అక్రమ కేసులు బనాయిస్తుండడం.. చూస్తుంటే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరు.. ప్రజలందరికీ అర్థమవుతుంది ఈ విషయంపై ఈరోజు జిల్లా ఎస్పీని కలిసి మెమొరాండం ఇద్దామని వస్తే.. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో డిఎస్పీకి వినతిపత్రం ఇచ్చాం. వైయస్ జగన్ పర్యటనలో.. కూటమి ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీ నేతలపై కక్షపూరితంగా కేసులు నమోదు చేయించింది. ఈ పద్ధతి సరికాదని.. ఇలాంటి వాటిని పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ప్రోత్సహించవద్దు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్ ఈరోజు కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై.. పోలీసులు ఇష్టానుసారంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చెబుతున్న వైయస్ఆర్‌సీపీ నేతల పేర్లను మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసి.. అడ్డగోలుగా కేసులు నమోదు చేస్తున్నారు. ఆ ఘటనలు జరిగిన సమయంలో వారు అక్కడున్నారా లేదా.. అన్న కనీస.. అవగాహన కూడా లేకుండా.. వారు ఏ సెక్షన్లు చెబితే ఆ సెక్షన్లు పెట్టి దుర్మార్గంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లో పోలీస్ డిపార్ట్మెంట్.. కీలుబొమ్మగా మారింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కు పూర్తిగా సహకరిస్తూ వస్తుంది వైయస్ జగన్ నెల్లూరు పర్యటన రోజు.. పోలీసులే వైయస్ఆర్‌సీపీ నేతలపై లాఠీచార్జ్ చేసి.. వారిని కిందపడేసి.. తిరిగి వైయస్ఆర్‌సీపీ నేతల పైనే అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటు ఇప్పటికే ఈ విషయంలో 25 మందిపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఇటీవల కావలి మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కూడా.. హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కావలిలో ఒకచోట ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందన్న..విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని ఉద్దేశంతో అక్కడ నిఘా ఉంచి ఫోటోలు తీయడానికి మనుషులను పంపితే.. రెక్కి నిర్వహించారని అభియోగం మోపడం దుర్మార్గం. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రజలకు ఎంతో విలువైన సేవలు అందించిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై.. ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. వైయస్ఆర్‌సీపీ నేతలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇలా ప్రతి ఒక్కరి పై.. అక్రమ కేసులు నమోదు చేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం.. ఈ విధంగా వ్యవహరిస్తుంది. వైయస్ఆర్‌సీపీ నేతలను.. అనవసరంగా టార్గెట్ చేసి.. కేసులు పెడుతున్న తెలుగుదేశం పార్టీని చూసి.. ప్రజలు కూడా భయపడుతున్నారు. రేపు ప్రజల మీద కూడా అక్రమ కేసులు బనాయి ఇస్తారేమో నన్ను సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను.. జిల్లా ఎస్పీ కార్యాలయంలో.. పోలీసు వారిని కలిసి అన్ని తెలియజేయడం జరిగింది. అక్రమ కేసులు విషయంలో ప్రభుత్వంలో మార్పు రాకుంటే రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా.. ముందుకు తీసుకెళ్లాలో.. ఆలోచన చేసి పటిష్టమైన కార్యచరణ రూపొందించి.. అమలు చేయడం జరుగుతుంది.