జాతీయ ఎస్టీ క‌మిష‌న్‌కు ఎంపీ త‌నూజ‌రాణి ఫిర్యాదు

న్యూఢిల్లీ:  పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సంద‌ర్భంగా కూట‌మి ప్ర‌భుత్వం అనుస‌రించిన తీరును వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్ట‌ర్  గుమ్మా త‌నూజ‌రాణి జాతీయ ఎస్టీ క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతార్ సింగ్ ఆర్యను అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ త‌నూజ‌ రాణి క‌లిశారు. పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో  ఎస్టీలను ఓటు హక్కు వినియోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఎంపీ జాతీయ ఎస్టీ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్టీలపై దాడులకు దిగిన రాష్ట్ర ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 

Back to Top