తిరువూరులో `బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ` 

ఎన్టీఆర్ జిల్లా:  తిరువూరు పట్టణంలోని 15వ వార్డులో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరువూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్   పట్టణ అధ్యక్షుడు చలమల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్న‌ర‌ దాటినా కూడా సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయ‌డం లేద‌న్నారు.  చంద్ర‌బాబు ఎన్నిక‌ల హామీలు అమ‌లు చేయ‌కుండా మోసపూరిత మాటల‌తో ప్రజలను మభ్యపెడుతున్నార‌ని మండిప‌డ్డారు.   కరోనా మహమ్మారి రాష్ట్ర ఆర్థిక వ్య‌వస్థ‌ను అతులాకుత‌లం చేసిన స‌మ‌యంలోనూ వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ పాల‌న అందించి ప్ర‌ధాని మ‌న్న‌న‌లు పొందార‌ని గుర్తు చేశారు.    కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకం కింద 8000 కోట్లు మాత్రమే స్త్రీలకు కేటాయిస్తే, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు  వైయస్ జగన్‌ స్త్రీల సంక్షేమం కోసం రూ.19 వేల కోట్లు ఖర్చు చేశార‌ని తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు నాటికి పింఛన్లు 66.34 లక్షలు. 2025 ఆగస్టులో ఇచ్చిన పింఛన్లు కేవలం 62.19 లక్షలు మాత్రమే ఉన్నాయ‌న్నారు. చంద్రబాబు నాయుడు పింఛన్లు 1000 పెంచి దాదాపు నాలుగు లక్షల మందికి పింఛన్లు తీసివేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబు సుపరిపాలన అంటే  ఇదేనా అని ప్ర‌శ్నించారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు యరమల రామచంద్ర రెడ్డి , కౌన్సిలర్స్ , వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Back to Top