గిరిజ‌న బాలిల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌

విశాఖ‌: న‌గ‌రంలోకి కింగ్ జార్జ్ ఆసుప‌త్రి(కేజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ప‌రామ‌ర్శించారు. ఐసోలేషన్ వార్డులో బాధిత బాలికలను  మాజీ డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, రాజన్న దొర, ఎంపీ తనూజా రాణి, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీను, పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా అధ్య‌క్షుడు ప‌రీక్షిత్‌రాజ్‌, త‌దిత‌రులు ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు. బాలికల తల్లితండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను పార్టీ నేత‌లు కోరారు. 

Back to Top