బోగ‌స్ ఓట్లు చేర్పించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి

ఎన్నిక‌ల అధికారికి వైయ‌స్ఆర్‌సీపీ విన‌తి

 
విజ‌య‌వాడ‌:  ఓట‌ర్ జాబితాలో బోగ‌స్ ఓట్లు చేర్చిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఎన్నిక‌ల అధికారిని కోరారు. ఆదివారం వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చ‌ల్లా మ‌ధుసుద‌న్‌రెడ్డి, శివ‌శంక‌ర్‌, త‌దిత‌రులు ఎన్నిక‌ల అధికారిని క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా చ‌ల్లా మ‌ధు మాట్లాడుతూ..  విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ బూత్ నంబ‌ర్ 13లోని డోరు నెంబరు 54-19-21 లో దావులూరి వెంకటేశ్వరరావు వయస్సు 75 సంవత్స‌రాలు, అతని భార్య ఇద్దరు మాత్రమే నివాసం ఉంటున్నారు. దావులూరి వెంకటేశ్వరరావు విజయవాడ కార్పొరేషన్ లోని యల్.ఐ.సి. కాలనీ, క్రీస్తు రాజుపురం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటూ అక్రమంగా మొత్తం ఆ ఇంటి నెంబరు పై 25
మంది వ్యక్తులను ఓటర్లుగా నమోదు చేయించారు. వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం, అక్రమంగా ఓటరు జాబితాలో చేర్చి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అయోచిత లబ్ధి చేకూర్చలనే తలంపుతో నమోదు చేయించార‌ని తెలిపారు.  విజయవాడ కార్పొరేషన్ ప‌రిధి,  రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో తెలుగుదేశం పార్టీ చెందిన పలువురు దొంగ ఓట్లను నమోదు చేసి ఓటరు జాబితాలో చేర్చార‌ని తెలిపారు. ఆ ఇంటిలో వారిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులను ఓటరు జాబితాలో చేర్చారు. అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఓటర్లుగా నమోదు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియామావళికి ,  సెక్షన్ 31 ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఇతర చట్ట నిబందనలు ప్రకారం అతనిపై తగు చర్యలు తీసుకోవలసినదిగా కోరారు. ఆ ఇంటి నెంబరులో అక్రమంగా
నమోదు అయిన ఓటర్లను ఓటరు లిస్ట్ నుంచి తొలగించి, వారు రాబోవు కార్పొరేషన్ ఎన్నికలలో ఓటు
వేయకుండ నిలువరించి మోసపూరిత చర్యకు బాధ్యులైన దావులూరి వెంకటేశ్వరరావు, ఇతర
వ్యక్తుల పై చట్టపరంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల‌ని ఎన్నిక‌ల అధికారిని కోరారు. 

Back to Top