వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే అభివృద్ధి

ఎంపీ అభ్యర్థి పీవీపీ, అసెంబ్లీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసులు

విజయవాడ: అభివృద్ధిని ప్రజలకు చేరువచేసేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుకు కదులుతోంది. నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికీ ప్రతీ సభల్లో చెబుతున్నారు. వైయస్‌ఆర్‌ సీపీని ఆదరించండి జీవితాల్లో సంతోషం నింపుతానని ప్రతి ఒక్కరికీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులు ఇంటింటికీ నవరత్నాలను తీసుకెళ్తున్నారు. విజయవాడలో పార్లమెంట్‌ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్, విజయవాడ పశ్చిమ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు పాలనలో విసిగిపోయామని, ఈ సారి వైయస్‌ జగన్‌కే అవకాశం ఇస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే యువతకు ఉద్యోగాలు, పేదలకు ఇళ్లు, అవ్వాతాతలకు పెన్షన్, రేషన్, పిల్లలకు ఉచిత చదువులు అందుతాయని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. ఫ్యాన్‌ గుర్తకు ఓటు వేసి గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. 

 

Back to Top