అనంతపురం: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు మంత్రి పరిటాల సునీత కుట్ర చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. రెవెన్యూ సిబ్బంది సహకారంతో వైయస్‌ఆర్‌సీపీ నేతల ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. రెండు ఓట్లు ఉన్నాయంటే అసలు ఓటును తొలగిస్తున్నారు. నియోజకవర్గంలో 14 వేల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. 11 వేల దొంగ ఓట్లను చేర్పించారని తెలిపారు. రెండు ఓట్లు ఉన్నాయంటే ఫామ్–7పై బీఎల్‌వోలు సంతకాలు చేయించుకుంటున్నారని చెప్పారు. అధికారుల నిర్వాకాన్ని గుర్తించామన్నారు. మంత్రి సునీతకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే అడ్డదారుల్లో గెలిచేందుకు ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.