తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీడీపీ నీచపు పోస్టులు చేసిందని ఆమె గుర్తు చేశారు. ఇదే సమయంలో ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలిస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా వైయస్ఆర్‌సీపీ నాయకులపై టీడీపీ నేతలు పెడుతున్న తప్పుడు పోస్టులపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో వైయస్ఆర్‌సీపీ నేతలు సోమవారం ఫిర్యాదు చేఆరు. తిరుపతి ఎంపీ ఎం. గురుమూర్తి, మాజీ మంత్రులు నారాయణ స్వామి, ఆర్.కే.రోజా, తిరుపతి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పలువురు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమాయకులపై కేసులు: భూమన కరుణాకర్‌రెడ్డి కూటమి ప్రభుత్వం అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు బనాయిస్తోంది. కూటమి కార్యకర్తలు, మద్దతుదారులు.. మా పార్టీ అధినేత వైయస్ జగన్‌పై, మహిళా నాయకులపై అసహ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు చేశారు. రాష్ట్రంలో వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులను ఐ-టీడీపీ ద్వారా వాళ్లే సృష్టించి, అది మాపై నెట్టేస్తున్నారు. అంతటితో ఆగకుండా అమాయకులపై కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. ఐ-టీడీపీ ద్వారానే చాలా పోస్టులు వచ్చాయి. వాటిపైనే ఫిర్యాదు చేశాం. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వారికి రిసీవ్డ్ కాపీ ఇవ్వాలి. కానీ, ఇవ్వకుండా మాతో దారుణంగా వ్యవహరించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండు చేశారు. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు తీసుకుని రిసీవ్డ్ కాపీ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడానికి జంకుతున్నారు, ఒక ఎంపీ, మేయర్, మాజీ డిప్యూటీ సీఎం పీఎస్‌కు వస్తే పోలీసులు వ్యవహరించేది ఇలాగేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఇలా వ్యవహరిస్తే ఇంకెక్కడి న్యాయం జరుగుతుందని ఫైర్ అయ్యారు. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి: మాజీ మంత్రి రోజా ఈ రోజు వైయస్ జగన్ గారి మీద, వైయస్ భారతమ్మ మీద, మా మహిళా నాయకుల మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేయడానికి వస్తే కనీసం ఆ కేసు తీసుకోవడానికి పోలీసులు తర్జన భర్జనలు పడుతున్నారు. ఫిర్యాదు తీసుకుని రిసిప్ట్ ఇవ్వడానికే అంత భయమా? పోలీసులు మీ టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ కొట్టండి కానీ కూటమి పార్టీ నాయకులకు కాదు, ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నాం వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు దిట్ట, పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌పైనే కార్టూన్లు వేయించిన ఘనుడు, చిరంజీవి గురించి ఆయన తల్లి గురించి, కుటుంబ సభ్యుల గురించి ఐటీడీపీ ద్వారా లోకేష్ దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పాడు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టులు పెడుతున్నారు, సుధారాణి, కడపలో సునీత విషయంలో పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో అందరం చూశాం మా సోషల్ మీడియా సైనికులకు ఏం జరిగినా జగనన్న చూస్తూ ఊరుకోరు, తప్పుడు కేసులతో భయపడితే ఎవరూ భయపడరు ఉమెన్ ట్రాఫికింగ్ పెరిగిపోయింది, ఈ ఐదు నెలల్లో ఉమెన్ ట్రాఫికింగ్ కింద 7,200 మందిని అమ్మేశారంటే ఈ పోలీస్ వ్యవస్ధ ఎంత దిగజారిందో అర్ధం అవుతుంది, ఇదే పవన్‌కళ్యాణ్ మరి ఇప్పుడేం చేస్తున్నారు, గతంలో మా ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన పవన్ సిగ్గుపడాలి ఏపీలో చంద్రబాబు, పవన్ పాలన హిట్లర్, గఢాఫీ కలిపి పాలిస్తున్నట్లు ఉంది, మీ తప్పులు ఎత్తి చూపితే తట్టుకోలేరా, నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు, తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయండి కానీ అన్యాయంగా అరెస్ట్‌లు చేస్తే మాత్రం ఏ ఒక్కరూ చూస్తూ ఊరుకోరు సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలించినట్లు ఉంది. చంద్రబాబు, పవన్ పాలనలో అదృశ్యమైన మహిళల ఆచూకీ కోసం కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?. వైయస్ఆర్‌సీపీ హయాంలో వేల సంఖ్యలో మహిళలు, యువకులు మిస్ అయ్యారని అబద్ధపు ప్రచారం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. కేవలం 36 మందే అని తేలింది. ఇది హోంమంత్రే బయటకు చెప్పారు. ఎం.గురుమూర్తి మాట్లాడుతూ..మేం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు గంటల కొద్ది నిలబెట్టి ఫిర్యాదు తీసుకోవడానికి వెనకాడారు, పోలీసుల ద్వారా తప్పుడు కేసులతో వేధిస్తే ఎవరూ వెనకాడరు మాకు ఉన్న ప్రోటోకాల్‌ను విస్మరిస్తే కచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వేస్తామని హెచ్చరిస్తున్నా, ప్రజా గొంతుకలను నొక్కే ప్రయత్నాన్ని విరమించుకోవాలి, లేదా రాబోయే రోజుల్లో తగిన మూల్లం తప్పదని హెచ్చరిస్తున్నా డిప్యూటి సీఎం కే.నారాయణ స్వామి మాట్లాడుతూ.. మేం ఐటీడీపీపై ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు కేసు తీసుకోవడం లేదు, ఇంత దారుణమైన పోస్టులు పెడుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోరా, అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఐటీడీపీ పోస్టులు పెడుతున్నా చర్యలు లేవు ఏపీలో రాజ్యాంగ హక్కులు కాలరాశారు, పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారు, మేం ఎలాంటి బెదిరింపులకు లొంగం, చంద్రబాబు మీ కూటమి పార్టీల పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు త్వరలో ఉందని హెచ్చరించారు.