బీసీలను బ్యాక్‌బోన్‌గా గుర్తించిన వైయస్ జగన్

సామాజికంగా బీసీలకు వైయస్ జగన్ పెద్దపీట

బీసీ కార్పోరేషన్లు, పదవులను ఇచ్చి గౌరవించారు

బీసీల వెన్ను విరిచిన ఘనుడు చంద్రబాబు

నేడు కూటమి పాలనలో బీసీలపై దౌర్జన్యాలు

బీసీల ఆత్మగౌరవాన్ని కాల రాస్తున్న కూటమి పార్టీలు

రాజకీయంగా బీసీల ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారు

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర స్ధాయి కార్యవర్గ సమావేశంలో నేతల ధ్వజం

తాడేపల్లి  రాష్ట్రంలో సామాజిక న్యాయంను సాధించేందుకు చిత్తశుద్దితో కృషి చేసిన నాయకుడు వైయస్ జగన్ అని వైయస్ఆర్‌సీపీ నేతలు అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే, స్వర్గీయ మహానేత వైయస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇటీవల శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ హత్యకు గురైన బీసీ నేత కురుబ లింగమయ్య మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన కులాలకు అండగా నిలిచి, వారిని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్ళిన దార్శనికుడు వైయస్ జగన్ అని కొనియాడారు. ఆయన నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీ బీసీల అభిమానాన్ని చూరగొందని పేర్కొన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు గత పదినెలలుగా బీసీలపై దాష్టీకాలకు పాల్పడుతున్నాయని, బీసీలను అణచివేస్తున్నాయని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైయస్ఆర్‌సీపీ నేతృత్వంలో కూటమి దౌర్భాగ్యపు పాలనపై బీసీలు తిరుగుబాటుకు సిద్దం అవుతున్నారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

మహాత్మా జ్యోతిరావు పూలే, దివంగత నేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాలకు నివాళులర్పించిన నేతలు
ఇటీవల అనంతపురం జిల్లాలో హత్యకు గురైన కురుబ లింగమయ్యకు సంతాపం తెలిపిన నేతలు.

ఈ సందర్భంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే...

సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన పార్టీ వైయస్ఆర్‌సీపీ: సజ్జల రామకృష్ణారెడ్డి, స్టేట్‌ కోఆర్డినేటర్‌

స్వాంతత్రం వచ్చిన తరువాత సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన ఏకైక పార్టీ వైయస్ఆర్‌సీపీ. సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందించి ప్రగతికి బాటలు వేయాలని అన్ని రాజకీయ పార్టీలు చెబుతాయి, కానీ మాటల్లో కాదు చేతల్లో చూపించింది ఒక్క వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమే. ఇది ప్రజలకు కూడా తెలుసు. ఐదేళ్ళలో వైయ‌స్ఆర్‌సీపీ వారు ఎవరైనా కాలర్‌ ఎగరేసుకుని తిరిగేలా వైయస్ జగన్‌ గారు పాలించారు. సామాజిక న్యాయం విషయంలో అతి పెద్ద ముందడుగు వేశాం. తండ్రి వైఎస్సార్‌ ఆశయాలను సాధించేందుకు అగ్నిపరిక్షలన్నీ ఎదుర్కొని జగన్‌ గారు తను నమ్మిన సామాజిక న్యాయం కోసం కృషి చేశారు. సమాజంలో అణగారిన వర్గాలు ఏ మేరకు వాటా ఉంటే అన్ని చోట్లా నిర్ణయాధికారం వారికి దక్కుతుందో ఆలోచించి వారికి ఆమేరకు అవకాశం కల్పించారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయం, అధికారంలోకి రాగానే దోచుకోవడం. చంద్రబాబు ఈ సారి గతంలోలాగా కూడా చెప్పడం లేదు, ఓపెన్‌ గానే నేను చేయనంటున్నాడు, బరితెగించి మాట్లాడుతున్నాడు. జగన్‌ గారు సంక్షేమం విషయంలో చెప్పనివి కూడా చేసి ఆ తర్వాత ప్రజల వద్దకు వెళ్ళారు. పేదల గుండెల్లో మనం సంపాదించుకున్న స్ధిరమైన స్ధానం చెక్కు చెదరలేదు. చంద్రబాబు ఈ పదినెలల పాలన చూసి జనానికి అర్ధమవుతుంది. చంద్రబాబు దుర్మార్గపు పాలనను మనం ప్రజల్లోకి తీసుకెళదాం. మనం ప్రజల పక్షాన ఉన్నామనే విషయం కూడా వారికి తెలియజేద్దాం. మనం వ్యవస్ధాగతంగా బలోపేతం అవుదాం, గతంలో కంటే మెరుగ్గా పూర్తిస్ధాయి కమిటీలు నియమించుకుందాం, పార్టీని బలోపేతం చేయడానికి అందరం శ్రమిద్దాం. కూటమి ప్రభుత్వ అరాచకపాలనను ఎండగడదాం, పోలీసు వ్యవస్ధను అడ్డుపెట్టుకుని బరితెగించి వ్యవహరిస్తున్నారు. నియంతృత్వ పాలనను చూస్తున్నాం. ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేస్తున్నారు, అధికార యంత్రాంగమే మాఫియా ముఠాలా వ్యవహరిస్తుంది. విశాఖలో నానారకాలుగా చేసి అవిశ్వాసం నెగ్గించగలిగారు. ఒక బీసీ మహిళ మేయర్‌ గా ఉన్న చోట పదవి నుంచి తప్పించారు. ఎక్కడా బలం లేకపోయినా బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మనం తట్టుకుని నిలబడ్డాం. ప్రజల మద్దతు మనకు మొదటి నుంచి ఉంది కాబట్టి అదే మనకు శ్రీరామ రక్ష. అనుబంధ విభాగాలు ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా ఉంటుంది. బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకుని చురుగ్గా పనిచేద్దాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం. సమాజంలో అట్టడుగువర్గాలకు మనం లబ్ధి చేయగలిగాం, చంద్రబాబు చేస్తున్న మోసం కూడా మనకు కనిపిస్తోంది. మనం అన్ని విభాగాలలో అన్ని పోస్టులు భర్తీ చేద్దాం. మైక్రో లెవల్‌లో ప్లానింగ్‌ అవసరం, ఆ దిశగా అడుగులు వేద్దాం. కూటమి నాయకులు మనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేక ఇలా అబద్దపు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని బలంగా తిప్పికొడదాం. గ్రామస్ధాయి వరకు పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేద్దాం. అన్ని కమిటీలను వీలైనంత త్వరగా భర్తి చేద్దాం. దోచుకోవడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోంది, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే ఎదుర్కుని విజయం సాధిద్దాం,         

కూటమి పాలనలో బీసీలపై అరాచకాలు: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ 

 బీసీలు ఎవరికీ భయపడనవసరం లేదు, ప్రజల్లోకి మనం దూసుకువెళుతున్నాం. బీసీలంటే బ్యాక్‌ బోన్‌ క్లాసెస్‌ అని మన నాయకుడు జగన్‌ గారు నిర్వచించారు, మన పార్టీ బీసీల నుంచే ఉద్భవించింది. కూటమి పాలనలో అరాచకాలు అణగారిన వర్గాలపై ఎక్కువగా జరిగాయి. అనంతపురం జిల్లాలో  బీసీ నేత కురుబ లింగమయ్యను దారుణంగా చంపారు. మన బీసీలంతా ఒక్కటై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎదిరించాల్సిన సమయం వచ్చింది. విశాఖ మేయర్‌ గా ఒక బీసీ మహిళను జగన్‌ గారు నియమిస్తే ఆమె పదవీ కాలం ముగియకముందే అక్రమంగా దింపేశారు. జగన్‌ గారి పాలనలో బీసీలకు న్యాయం చేశారు. కూటమి పాలనలో ఏ ఒక్కరికీ ఏ పథకం అందడం లేదు. మన పార్టీని మనమంతా కలిసి తిరిగి నిలబెట్టుకుందాం.

వైయస్ఆర్‌సీపీ పాలన బీసీలకు స్వర్ణయుగం: ఆర్‌. రమేష్‌ యాదవ్‌, బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు

బీసీలను గత ప్రభుత్వాలు ఓటుబ్యాంక్‌ గా చూస్తే జగనన్న మాత్రం బీసీలను వెన్నెముకలాగా భావించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాటికి 56 మందిని ఛైర్మన్‌లుగా,  612 మందిని డైరెక్టర్లుగా నియమించారు. 32 మంది బీసీలను ఎమ్మెల్యేలుగా గెలిపించి, అందులో 11 మందిని మంత్రులుగా చేసిన ఘనత మన జగనన్నది. బీసీ డిక్లరేషన్‌ కూడా ఇచ్చిన ఘనత మన జగనన్నది. జగనన్న ప్రభుత్వంలో ఏ పదవులు అయినా బడుగు, బలహీనవర్గాలకే ప్రాధాన్యతనిచ్చారు. కడప జిల్లాలో యాదవ సామాజికవర్గం నుంచి మొట్టమొదటి వ్యక్తిగా చట్టసభల్లో అడుగుపెట్టింది నేను. నాకు ఈ అవకాశాన్ని జగనన్న కల్పించారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఎమ్మెల్సీని చేశారు. అంతేకాదు నాకు వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్‌  అధ్యక్ష పదవిని కూడా ఇచ్చారు. చంద్రబాబు గొర్రెలు, బర్రెలు కాసుకునే వారికి చట్టసభలెందుకు అన్నారు, కానీ  జగనన్న 5 మందిని ఎమ్మెల్సీలుగా చేశారు, ఇద్దరిని మంత్రులుగా చేశారు. స్పీకర్‌ గా కూడా తమ్మినేని సీతారామ్‌ గారికి అవకాశం ఇచ్చి బీసీలను గౌరవించారు. చంద్రబాబు బీసీల వెన్నెముక విరిస్తే జగనన్న మాత్రం మనల్ని బీసీలకు రాజ్యాధికారం కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలను నట్టేట ముంచింది, కూటమి నాయకులు ప్రజల వద్దకు వెళితే తరిమితరిమి కొడతారు. కూటమి పాలనలో స్కీమ్‌లు నిల్‌ - స్కామ్‌లు ఫుల్‌, దోపిడీ ఫుల్‌ - డెవలప్‌మెంట్‌ నిల్‌, కమిషన్లు ఫుల్ - పధకాలు నిల్‌. 2029లో  జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం.

కూటమి పార్టీలకు బీసీల సత్తా చూపిద్దాం: నౌడు వెంకటరమణ, బీసీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

రాబోయే రోజుల్లో కూటమి పార్టీలకు బీసీల సత్తా చూపిద్దాం. నాడు వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి గారు  బీసీలకు న్యాయం చేశారు, దానిని కొనసాగింపుగా జగన్‌ గారు బీసీలకు అన్ని రంగాలలో అవకాశం కల్పించారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా జగన్‌ గారు సుపరిపాలన అందించారు. పేద, బడుగు, బలహీనవర్గాల ఇళ్ళకు అనేక పధకాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం దొంగ హమీలతో అధికారం కైవసం చేసుకున్నా అతి తక్కవ కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూట కట్టుకుంది. టీడీపీకి సిగ్గూ శరం లేకుండా మాది బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నారు, కానీ బీసీలకు ఒరగబెట్టింది శూన్యం. మనం యుద్దానికి సిద్దం కావాలి, జగన్‌ గారి హయాంలో బీసీలకు ఏ పధకాలు అందాయి, ఇప్పుడు అవి ఎలా నిర్వీర్యం చేశారనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కూటమి ప్రభుత్వాన్ని నేలకరిపించాలి, మళ్ళీ జగనన్నను అధికారంలోకి తీసుకురావాలి. 

పూలే ఆశయాలను జగనన్న కొనసాగించారు: జోగి రమేష్‌, మాజీ మంత్రి

గడిచిన అయిదేళ్ళలో వైయస్ఆర్‌సీపీ పాలనను, నేడు కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు పోల్చుకుంటున్నారు. ఈ పదినెలల పాలనలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజల వద్దకు తీసుకెళదాం. బలహీనవర్గాలు అంటే ఈ సమాజానికి బ్యాక్‌ బోన్‌ అని చెప్పిన పూలే గారి ఆశయాలను  జగనన్న కొనసాగించారు. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఏకైక వ్యక్తి జగనన్న. జగనన్న పాలనలో బీసీలకు రాజ్యాధికారం అందజేశారు, చంద్రబాబు మాత్రం కులవృత్తుల వారికి ఆదరణ పేరుతో ద్రోహం చేశారు. లక్షలాదిమంది మన పిల్లలకు నాడు వైఎస్‌ఆర్‌ చూపిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల ఇంజినీర్లు, డాకర్లు అయ్యారు. అభినవ పూలే మన జగనన్నను మనం మరోసారి సీఎం చేసుకుందాం. జగన్‌ 2.0 పాలన బీసీలదే, ఈ సారి గెలుపు మనదే. మనకు ఇబ్బందులు తాత్కాలికం, రెడ్‌ బుక్‌ తో మనల్ని భయపెట్టలేరు. ప్రజలే తిరగబడతారు, మనం కలిసికట్టుగా ధైర్యంగా ఎదుర్కుందాం. మనమంతా జగనన్నకు అండగా ఉందాం, జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం. 

కూటమి సూపర్ సిక్స్ మోసాలను బయటపెడదాం: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

బీసీలు అంతా కలిసికట్టుగా పని, కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ అని మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. చంద్రబాబు ఏ రోజూ నిజం చెప్పరు, కూటమి పాలన దోచుకో, దాచుకో, పంచుకోలా సాగుతుంది. బీసీలు ఐక్యతతో కష్టపడి మళ్ళీ అధికారం సాధిద్దాం. మనం అంతా క్షేత్రస్ధాయిలో సమన్వయం చేసుకుని ఉత్సాహంగా ముందుకెళదాం. రాష్ట్రస్ధాయి నుంచి గ్రామ స్ధాయి వరకు కమిటీలు వేసుకుని పార్టీని పటిష్టం చేసుకుందాం. నేను దేవుడికి తప్ప ఎవరికీ భయపడను, నాపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. 

ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం: మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ 

వైయస్ జగన్ గారి పాలనలో బీజీలు ఆత్మగౌరవంతో జీవించాయి. అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందుకున్నాయి. రాజ్యాధికారాన్ని అనుభవించాయి. జగన్‌ గారు తన పాదయాత్రలో పేదల కష్టాలు చూశారు. వారిని ఆదుకుంటామని మాట ఇచ్చి అధికారంలోకి రాగానే మాట నెరవేర్చారు. మాట ఇస్తే తప్పని మనిషి ఆయన, ఆయన మనసున్న నాయకుడు, యావత్‌ దేశానికి ఆయన శక్తి ఏంటో తెలుసు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం తపిస్తారు. నాడు రాజశేఖర్‌ రెడ్డి గారు ప్రజలందరికీ మేలు చేయాలని చూశారు, ఆయన మరణం తర్వాత జగన్‌ గారు అదే బాటను అనుసరించారు. కూటమి పార్టీలు కలిసి కుతంత్రాలతో గెలిచారు, మనం కలిసి పోరాడుదాం, ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళదాం. బీసీలు అత్యంత బలమైన వర్గం, మనం ఏదైనా సాధించగలం. తుదిశ్వాస వరకూ బీసీలు జగనన్నకే అండగా ఉంటారు.

Back to Top