రేపు శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం

ఈ నెల 30న సీఎంగా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం 

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం ఈ నెల 25వ తేదీన ఏర్పాటు చేసిన‌ట్లు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ స‌ల‌హాదారు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా వైయ‌స్ఆర్ సీపీ  అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీ ప్రమాణస్వీకారం చేస్తార‌ని ఆయ‌న తెలిపారు.  శాసనసభా పక్షం సమావేశమై వైయ‌స్ జగన్ ను తమ నేతగా ఎన్నుకుంటారనీ, అనంతరం  గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలుస్తామని చెప్పారు.  

Back to Top