చంద్రబాబు డ్రామాలు ఎంతోకాలం సాగవు...

ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు

వైయస్‌ జగన్‌ పోరాటంతో ప్రత్యేకహోదా సంజీవం 

ధర్మపోరాటం పేరుతో ఈవెంట్లు...

 వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి

హైదరాబాద్‌: రాజకీయ ప్రయోజనాల కోసం హోదా అంశాన్ని బాబు తలకెత్తుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రత్యేకహోదా అవసరం లేదన్న చంద్రబాబు..కొత్త రుచి లేని పాత సరుకును  మూటగట్టి ఇస్తే దానిని బ్రహ్మాండంగా ఉందని పొగిడి.. సన్మానాలు చేసిన చంద్రబాబు..నేడు ధర్మపోరాట దీక్షలతో  డ్రామాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబు కొత్త నాటకాలకు తెరతీశారన్నారు. నాలుగేళ్లుగా హోదాపై అనేక మాటలు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రసవత్తరంగా నాటకం నడిపిస్తున్నారన్నారు. హోదా కాదని ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందన్నారు.సొంత ప్రయోజనాల కోసం ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు ఈవెంట్లు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్ర ఖజనా నుంచి  కోట్లాది రూపాయలు తరలించి ధర్మపోరాట దీక్షలంటూ ప్రజల సొమ్మును దుర్వినియోగపరుస్తున్నారు. దీక్షలకే కాకుండా యాడ్స్‌ రూపంలో కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నారని కాగ్‌ రిపోర్టులో తేలిందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఐదారు నెలలుగా జీతాలు చెల్లించలేదని, దీంతో వారు  అవస్థలు పడుతున్నారు.మరో పక్క తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారన్నారు.  ఓటమి భయంతోనే ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేపట్టారని దుయ్యబట్టారు.రాజకీయ పార్టీలు తమ సొంత వనరులతో కార్యక్రమాలు చేసుకోవాలన్నారు.ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయకూడదన్నారు.ప్రభుత్వ ఖజనాకు పాలకులు ట్రస్టీ మాత్రమేనని, దానిలో ప్రతి పైసాపై లెక్కలు చూపించాల్సిన బా«ధ్యత చంద్రబాబుకు ఉందన్నారు. నిసిగ్గుగా  బరితెగించి సరదాలు,ఈవెంట్లు కోసం ప్లైట్‌ టిక్కెట్ల నుంచి దుబారా చేస్తున్నారన్నారు. ఢిల్లీని వేదికగా చేసుకుని చంద్రబాబు డ్రామాలాడుతున్నారు .

వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిజాయతీగా,చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ పోరాటంతో ప్రత్యేకహోదా అంశం సజీవంగా ఉందన్నారు. ఆర్టిస్టు స్క్రిçప్టును చదివించినట్లు రోజుకో డైలాగు చంద్రబాబు మాట్లాడాతున్నారన్నారు.  మీడియా ప్రచారం మీదనే పార్టీని నడిస్తున్నారని దుయ్యబట్టారు.ఇది కాలకాలం సాగదని.. ప్రజలందరూ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు.  చంద్రబాబు డ్రామాలను ప్రజలందరూ గ్రహించాలన్నారు. మోదీ–చంద్రబాబులకు ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టడంలేదన్నారు. మోదీ–చంద్రబాబు ఒకరిపై ఒకరు లాలూచీ కుస్తీ చేస్తున్నారన్నారు. నిధులిచ్చామని బీజేపీ నేతలంటున్నారని, ఇవ్వలేదని బాబు అంటున్నారన్నారు.

కేంద్రం నిధులు దుర్వినియోగం అయితే ఎందుకు దర్యాప్తు చేయరని ప్రశ్నించారు. మోదీ చంద్రబాబులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఎందుకు దర్యాప్తు చేయరని ప్రశ్నించారు. పోలవరంలో ఆధారాలతో సహా అక్రమాలు వెలుగుల్లోకి వచ్చాయన్నారు. పోలవరం కుంభకోణం విషయంలో కేంద్రం ఎందుకు ఉదాసీనంగా ఉందని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై బీజేపీ నేతలు కేవలం ఆరోపణలకే పరిమితమవుతున్నారని విచారణ ఎందుకు జరగడంలేదో సమాధానం చెప్పాలన్నారు.. వైయస్‌ఆర్‌సీపీ అ«ధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి,అక్రమాలపై విచారణ జరిపిస్తామని తెలిపారు.

 

Back to Top