వైయ‌స్‌ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లను చెబితే రూ.ల‌క్ష‌

చంద్రబాబుకు  బి.వై. రామయ్య బంపరాఫర్ 
 

కర్నూలు : ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు పార్ల‌మెంట్ ఇన్‌చార్జ్ బి.వై. రామయ్య ఆదివారం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లను చెబితే చాలు.. లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధిని విస్మరించిన చంద్రబాబుకు జిల్లాలో అడుగుపెట్టే ఆర్హత లేదని, విమర్శించారు. జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రిగా ఫెయిలైన చంద్రబాబు ప్రతిపక్షనేతగా కూడా అట్టర్‌ ప్లాప్‌ అయ్యారని ఎద్దేవా చేశారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసి, ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం చాతకాక కేవలం విమర్శలకు పరిమితమయ్యాడని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా బుద్ధి రాలేదని, ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు.  

Read Also: ఆరు నెల‌ల్లోనే ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు

తాజా ఫోటోలు

Back to Top