తిరుపతి: రాష్ట్రంలో 120 స్థానాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని వైయస్ఆర్‌సీపీ నేత పిల్లి సుభాష్ ధీమా వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రజల మద్దతు ఆయనకే ఉందని, జాతీయ స్థాయిలో సర్వేలన్ని వైయస్ఆర్‌సీపీకే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. తిరుమల తిరుపతి శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వామి వారిని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి రావాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. అమరావతి కోటపై వైయస్ఆర్‌సీపీ జెండా వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృద్వీరాజ్ మొదటిసారిగా అలిపిరి నుంచి కాలినడక మార్గంలో వెళ్లారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తానని ఆయన తెలిపారు. ఏపీ ప్రజల ఆకాంక్ష మేరకు వైయస్ జగన్ సీఎం కావాలన్నారు. మే 23న అమరావతి కోటపై వైయస్ఆర్‌సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.