ఇంకోసారి ఇలాంటి వార్తలు రాస్తే క్రిమినల్‌ చర్యలు

 వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి 
 

కృష్ణా జిల్లా : పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తనపై దుష్ప్రచారం చేస్తుందని వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి మండిపడ్డారు. కావాలనే పచ్చ మీడియా తనపై ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తుందన్నారు. తాను ఏ పార్టీ మారబోనని,  వైయ‌స్ఆర్‌సీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంకోసారి ఇలాంటి వార్తలు రాస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. శనివారం ఆయన ఉయ్యూరు మండలంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సర్కార్‌ రైతులకు వెన్నపోటు పొడిచిందని విమర్శించారు. పసుపు, కందకి గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఫెథాయ్‌ తుపాను బాధితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో  వైయ‌స్ఆర్‌సీపీకి ఘనవిజయం అందించాలని ప్రజలను కోరారు.

 

Back to Top