చంద్రబాబు పాలనలో బీసీలకు అన్యాయం..

బీసీలను ఆదుకోవడంలో టీడీపీ వైఫల్యం..

బలహీనవర్గాలను ఓటు బ్యాంకుగానే చూశారు..

వైయస్‌ఆర్‌సీపీ నేత కొలుసు పార్థసారధి..

విజయవాడ: తెలుగుదేశం పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది తప్ప.. వారి అభివృద్ధికి,జీవన ప్రమాణా స్థాయి పెంచడానికి  ఎటువంటి చర్యలు తీసుకోలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం చేశారని, రాజకీయ,రాజ్యాంగ పదవుల్లో వారిని అణగదొక్కారని విమర్శించారు. గతంలో బీసీలు మా ఓటు బ్యాంకు అని,  80 శాతం బీసీలు మాకే ఓటు వేస్తారని  టీడీపీ పార్టీ గొప్పలు చెప్పుకుంటుందన్నారు. కాని ఇప్పుడూ వరుకూ బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఎటువంటి కార్యక్రమం తీసుకురాలేదన్నారు.వారికి నిర్ధిష్టంగా మేలు చేసే పథకాలు తీసుకురాలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో బలహీనవర్గాల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందన్నారు.

గతంలో బలహీనవర్గాల్లో ఉన్నత చదువులు.. కొంతమందికే పరిమితమయ్యేందని...కాని వైయస్‌ఆర్‌ హయాంలో ప్రతి కుటుంబంలో కూడా ఉన్నత చదువులు చదివే  అవకాశం కలిగిందన్నారు. బలహీనవర్గాలకు ఇళ్లు కేటాయింపు, ఆర్థికంగా ఆదుకోవడంలో గాని,  రాజకీయంగా గౌరప్రదమైన పదవులు కల్పించడంలో గాని చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు చేసిన మోసం ఇందుకు తార్కాణమన్నారు. ఎన్నికల సమయంలో మీటింగ్‌లు పెట్టి కార్పొరేషన్లు ఇస్తానని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారన్నారు

చంద్రబాబుకు బలహీనవర్గాల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. మూల ధనం చెప్పకుండా కార్పొరేషన్ల ఏర్పాటుకు జీవోలు ఇవ్వడం పట్ల తప్పబట్టారు. ఐఏఎస్‌ అధికారులు కూడా అశ్చరపోయే విధంగా ఆ జీవోలు తయారుచేశారని మండిపడ్డారు.నేడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై బీసీలకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఏడాదిన్నర నుంచి రాష్ట్రమంత బీసీ అధ్యయన కమిటీ వేసి పూర్తి విషయాలు అవగాహన చేసుకున్నారన్నారు.

తాజా వీడియోలు

Back to Top