చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి 

వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాట ఓబులేష్ 
 

కర్నూలు:  దళిత ఐఏఎస్‌ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాట ఓబులేష్ 
డిమాండు చేశారు. కర్నూలు నగరంలోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓబులేష్ మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు బీసీజీ నివేదికపై మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఐఏఎస్‌ అధికారి విజయకుమార్ గాడు మనకు చెపుతాడు అన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీనియర్ ఐఏఎస్‌ దళిత అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు బీఆర్‌ అంబేద్కర్‌  విగ్రహ పాదాలు పట్టుకొని క్షేమాపణ కోరాలని డిమాండు చేశారు.  గతంలో కూడా చంద్రబాబు ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారని హేళనగా మాట్లాడినట్లు గుర్తు చేశారు.  దళితులకు సీఎం వైయస్‌ జగన్‌ తన కేబినెట్‌లో పెద్ద పీట వేశారన్నారు. సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజేష్, జిల్లా కార్యదర్శి రైల్వే ప్రసాద్, మహిళ రాష్ట్ర కార్యదర్శి రేణుకమ్మ, జిల్లా మహిళ విభాగం నాయకురాలు విజయకుమారి, కేదార్నాథ్, కట్టారి సురేష్, జిల్లా కార్యదర్శి రాజేష్, జీ రాజశేఖర్, సురేఖ, అది, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Back to Top