హామీలు అమలు చేయకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, శ్రీ‌శైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి

వెలుగోడు మండలంలో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం 

నంద్యాల‌: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, శ్రీ‌శైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి మండిప‌డ్డారు. శ‌నివారం శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో "బాబు షూరిటీ -- మోసం గ్యారంటీష  కార్య‌క్ర‌మంపై పార్టీ  విస్తృత స్థాయి సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ప్రభుత్వం లేదని, ప్రజలను ముంచే ప్రభుత్వం మాత్రమే ఉందని అన్నారు.  అరాచక పాలన సాగుతోందని, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూ కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశామని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పే ధైర్యం కూటమి నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. ఏడాది తర్వాత తల్లికి వందనం పథకాన్ని అరకొరగా అమలు చేసి ప్రజలకు ఏదో వెలగబెట్టినట్లు ఆ పథకం తన కుమారుడు లోకేష్‌ కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పుకోవడం ఆయన చేతగానితనానికి నిదర్శనం అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని చెప్పిన చంద్రబాబు నేడు ఉచిత బస్సును జిల్లాకే పరిమితం చేయడం మరోసారి మహిళలు మోసం చేయడమేమన్నారు.  కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు శిల్పా భువ‌నేశ్వ‌ర్‌రెడ్డి, అంబాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఇలియాస్‌ఖాన్‌, లాలం ర‌మేష్‌, షంషీర్ అలీ,త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top