గుంటూరును సుందర నగరంగా తీర్చిదిద్దుతాం

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి 

గుంటూరు: గుంటూరును సుందర నగరంగా తీర్చిదిద్దుతామని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.  నల్లకుంటలో 29వ డివిజన్‌ వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి షేక్‌ రోషన్‌కు మద్దతుగా వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.వైయస్‌ఆర్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అప్పిరెడ్డి అభ్యర్థించారు. విపత్కర పరిస్థితిలో ప్రభుత్వం ఆందుకుందన్న భావనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఎప్పుడు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. గుంటూరులోని అన్ని వార్డుల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. మంచి మెజారిటతో గెలిచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

 

Back to Top