అచ్చెన్నాయుడి హత్యా రాజకీయాలు ఇక సాగవు

వైయస్‌ఆర్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌

అచ్చెన్నాయుడి తండ్రి నుంచే హత్యా రాజకీయాలు మొదలు

ఎందరినో చంపేసి రాజకీయాల్లో అడ్డు తొలగించుకున్నారు

పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో నామినేషన్‌ వేస్తే చంపుతామని బెదిరించారు

పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి 115 సర్పంచ్‌ స్థానాలు

తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో కేవలం 22 స్థానాలకే పరిమితం

 

శ్రీకాకుళం:  తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి చరిత్ర అంతా హత్యా రాజకీయాలేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఆయన తండ్రి గాలినాయుడి నుంచే హత్యా రాజకీయాలు మొదలయ్యాయయని చెప్పారు. మొట్ట మొదటిసారి అచ్చెన్నాయుడి కుటుంబ హత్యా రాజకీయాలను అడ్డుకుని, ప్రజలు ప్రశాంతంగా ఓట్లు వేసేలా వైయస్‌ఆర్‌సీపీ కృషి చేసిందని దువ్వాడ శ్రీనివాస్‌ తెలిపారు. టెక్కలిలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

ఎందరినో చంపేశారు..
ఎ్రరనాయుడు, అచ్చెన్నాయుడు తమకు రాజకీయంగా అడ్డుపడుతున్న ఎందరో చంపేసి అడ్డుతొలగించుకున్నారని దువ్వాడ శ్రీనివాస్‌ తెలిపారు. తన తండ్రి గాలి నాయుడి నుంచే హత్యా రాజకీయాలు మొదలయ్యాయని చెప్పారు. సర్పంచ్‌గా తమకు వ్యతిరేకంగా నామినేషన్‌ వేశారని 1982లోనే హత్య చేశారన్నారు. దాదాపు 15 పంచాయతీల్లో మొన్నటి దాకా అచ్చెన్నాయుడి కుటుంబీకులే గుండాలను అడ్డుపెట్టుకుని రిగ్గింగ్‌ చేసేవారన్నారు. ఒకసారి అచ్చెన్నాయుడు రిగ్గింగ్‌ చేసేందుకు వెళ్తే ఒకరు అడ్డు పడటంతో వేటకొడవలితో దారుణంగా పొడిచి హత్య చేశారన్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కటే దాదాపు 3 కిలోమీటర్ల మేర అచ్చెన్నాయుyì ని తరిమికొట్టారని, ఆ దెబ్బకు ఆయన తలపై పెద్ద గాయం అయ్యిందని చెప్పారు. అచ్చెన్నాయుడికి గుండుగీస్తే వాస్తవం వెలుగు చూస్తుందన్నారు.  చివరకు ఆయన కుటుంబానికి చెందిన కింజారపు భుజంగరావు అలియస్‌ బుజ్జి నామినేషన్‌ వేయాలని చూస్తే హత్య చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఓ మహిళను వివస్త్రను చేసి అవమానించారన్నారు. ఎందరినో బట్టలు విప్పదీసి కొట్టారని పేర్కొన్నారు.

ఎంత మందిని చంపుతారు
అచ్చెన్నాయుడు తనకు ఎదురువచ్చిన వారిని చంపుతూపోతున్నారని, ఇలా ఎంతమందిని చంపుతారని దువ్వాడ శ్రీనివాస్‌ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడి సొంత పంచాయతీ నిమ్మాడలో నామినేషన్‌ వేసేందుకు కింజారపు అప్పన్న ముందుకు వస్తే ఆయన్ను కూడా బెదిరించారన్నారు. చివరకు తాను కింజారపు అప్పన్న చేత నామినేషన్‌ వేయిస్తే మమ్మల్ని చంపాలని దాడి చేశారన్నారు. ఆ వీడియోలు ఇప్పటికే విడుదల చేశామన్నారు. అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్‌ తనపై దాడి చేశారని తెలిపారు. 

అచ్చెన్నాయుడు ఓ గుండా, క్రిమినల్‌
తెలుగు దొంగల పార్టీకి అధ్యక్షుడైన అచ్చెన్నాయుడు ఓ గుండా, రౌడీ, క్రిమినల్‌ అని దువ్వాడ శ్రీనివాస్‌ విమర్శించారు. ఎందరినో హింసించి అక్రమాస్తులు సంపాదించారని పేర్కొన్నారు.అచ్చెన్నాయుడి అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని దువ్వాడ శ్రీనివాస్‌ డిమాండు చేశారు.

వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేశాం
టెక్కలి నియోజకవర్గంలోని 135 స్థానాలకు పంచాయతీ ఎన్నికలు జరిగితే అందులో 115 పంచాయతీల్లో వైయస్‌ఆర్‌సీపీ జెండాను ఎగురవేశామని దువ్వాడ శ్రీనివాస్‌ తెలిపారు. టీడీపీ మద్దతుదారులు కేవలం 22 పంచాయతీల్లో మాత్రమే గెలుపొందారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ స్థాయిలో అచ్చెన్న కుటుంబానికి ఇంత పరాభావం ఎప్పుడు లేదన్నారు. ఎన్నికలు జరిగే ప్రతిసారి అచ్చెన్నాయుడి కుటుంబీకులు అధికారంలో ఉండటంతో ఓటర్లను బెదిరించి, పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌లు చేసి గెలిచేవారన్నారు. మొదటిసారి వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అచ్చెన్నాయుడి రౌడీయిజానికి ఎదురుతిరిగి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చేశామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంక్షేమ పథకాలతో సంతృప్తిగా ఉన్న ప్రజలు వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులకు ఓట్లు వేసి గెలిపించారన్నారు. ఇకపై టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడి హత్యా రాజకీయాలు సాగవని దువ్వాడ శ్రీనివాస్‌ హెచ్చరించారు.

 

Back to Top