విపత్కర పరిస్థితుల్లో టీడీపీ తీరు సిగ్గుచేటు

వైయస్‌ఆర్‌ సీపీ నేత దేవినేని అవినాష్‌

విజయవాడ: కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు దేవినేని అవినాష్‌ అన్నారు. వైరస్‌ వ్యాప్తి నివారణలో వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్ల పనితీరు అభినందనీయమన్నారు. విజయవాడలో దేవినేని అవినాష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ మూడు మాస్కుల చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. ఒకవైపు వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు అమలు చేస్తూనే.. మరోపక్క ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తోందన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ టీడీపీ నేతలు రాజకీయం చేయడం సిగ్గుచేటని అవినాష్‌ మండిపడ్డారు. దొంగ దీక్షలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని సూచించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top